ఖలేజా పాటలు

హేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఖలేజా'. అనుష్క నాయిక. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. శింగనమల రమేష్‌, సి.కల్యాణ్‌ నిర్మాతలు. మణిశర్మ సంగీతం అందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాటలు విడుదలయ్యాయి. మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌కృష్ణ చేతుల మీదుగా పాటలను ఆవిష్కరింపజేశారు. అనంతరం మహేష్‌ మాట్లాడుతూ ''అందరి అంచనాలను అందుకొనే చిత్రమిది. త్రివిక్రమ్‌ తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకొంటుంది. మణిశర్మ చక్కటి సంగీతం అందించారు. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నాకైతే సదాశివ, పిలిచే పెదవులపైన.. అనే పాటలు బాగా నచ్చాయి. కథానాయకుడిని పరిచయం చేసే పాట ఇంకా వైవిధ్యంగా ఉంటుంది. నేను ట్విట్టర్‌లో కొన్ని పాటల్ని ఉంచాను. అభిమానుల స్పందన బాగుంద''న్నారు. ''మహేష్‌-త్రివిక్రమ్‌ కలయిక స్థాయిని చెప్పే చిత్రమిది. మణిశర్మ అందించిన స్వరాలు బాగున్నాయి. పెద్ద విజయాన్ని సాధిస్తుందీ చిత్రం'' అన్నారు అనుష్క. మణిశర్మ మాట్లాడుతూ ''మహేష్‌తో కలిసి చేసిన 'రాజకుమారుడు', 'మురారి', 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి' చిత్రాలు నాకు మంచి పేరును తీసుకొచ్చాయి. వాటిని మించి ఉంటాయి ఇందులోని పాటలు. సదాశివ.. అనే పాటకు చక్కటి స్పందన లభించింద''న్నారు. ''కేవలం పాటలే కాదు, నేపథ్య సంగీతానికి కూడా ప్రాధాన్యం ఉంది. మణిశర్మ సంగీతం ఓ ఆకర్షణ. చిత్రాన్ని వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాత సి.కల్యాణ్‌. ఈ కార్యక్రమంలో మహేష్‌ భార్య నమత్ర, నిర్మాత శింగనమల రమేష్‌, గీత రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సోనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

‘జూనియర్ ప్రిన్స్’ హల్‌చల్

ప్రిన్స్ మహేష్‌బాబు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్- ‘ట్విట్టర్’లోకి వెళితే.. ఆయన తనయుడు ‘జూనియర్ ప్రిన్స్’ గురించి ఎక్కువ కబుర్లు కనిపిస్తాయి. జూనియర్ ప్రిన్స్ అంటే అర్థమై వుంటుంది... మహేష్‌బాబు తనయుడు ‘గౌతమ్’ అని. షూటింగ్ లేని సమయంలో కొడుకుతో ఎక్కువ సమయం గడపడం, ఆ చిన్నారితో ఆడుకోవడం, అతని ముద్దు ముద్దు మాటలు వినడం మహేష్‌కు చాలా సరదా.

అంతేకాదు- కొడుకుని అప్పుడప్పుడు సరదాగా షూటింగ్‌కు తీసుకెళ్ళడం.. షాట్ గ్యాప్‌లో గౌతమ్ చెప్పే కబుర్లు వినడం గౌతమ్ చెప్పే ఆ మాటలతో తను ఉప్పొంగిపోవడం మహేష్‌కు మహా ఆనందం. ఇక అసలు విషయానికొస్తే - ఇక్కడి ఫొటోలో చేతిలో గిఫ్ట్‌ప్యాక్‌తో ఆనందంగా, ఉత్సాహంగా అడుగులేస్తున్న ఈ లిటిల్ ప్రిన్స్ మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్‌దెక్కన్ హోటల్‌లో హల్ చల్ చేశాడు.

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కూతురు ‘అహనా’ పుట్టినరోజు వేడుక సందర్భంగా తల్లి నమ్రతా మహేష్‌తో కలిసి వచ్చిన గౌతమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆ వేడుకలో అక్కడి వారిని తన ముద్దు ముద్దు మాటలతో అలరించాడు గౌతమ్.


నమ్రతతో నా ప్రేమ ఇలా మొదలైనది..!

ఆమె సింప్లిసిటీ నాకిష్టం. ఆమెలోని స్వచ్ఛత అంటే మరీమరీ ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం పెళ్లిచేసుకుందాం అని నేనెప్పుడూ నమ్రతకు చెప్పలేదు అంటూ ప్రిన్స్ మహేష్ బాబు   తన భార్య నమితతో ప్రేమలో పడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..వంశీ సినిమా షూటింగ్ కోసం మేము 40 రోజులపాటు ఫారిన్ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్ ముగిసే చివరి రోజున కానీ, ఈ 40 రోజుల్లో మా మధ్య విడదీయలేనంతగా అనుబంధం ఏర్పడిపోయిందని గుర్తించలేకపోయాం. నమ్రతతో నేను ప్రేమలో పడిన క్షణాలు మరువలేనివి. అయితే దీనిపై నన్నెవరైనా అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అదలా జరిగిపోయిందంతే అన్నారు. అలాగే నాన్న, అమ్మల అంగీకారం తీసుకోవడం కోసం నమ్మతను నేనిష్టపడుతున్నాననీ, ఆమెతో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు నమ్రత గురించి నాన్న వాకబు చేశారు. ఆ తర్వాత 2005 ఫిబ్రవరిలో నేనూ నమ్రత పెళ్లి చేసుకున్నాం. ఆమె నా జీవిత భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం. అయిదేళ్లపాటు డేటింగ్ చేశాక మా ఇద్దరి పెళ్లి జరిగింది. పెళ్లై అయిదేళ్లయింది. మేమిద్దరం గడిపే ప్రతి క్షణం మా బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. నమ్రత నాకు భార్య మాత్రమే కాదు..నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అంటూ ముగించారు. అమృంతాంజనం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఈ విషయాలను సరదాగా చర్చించారు.

అక్టోబరు 7న ఖలేజా


అక్టోబర్ 7... సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులకు పండగ రోజే అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజునే ‘మహేష్ ఖలేజా’ చిత్రం విడుదల కానుంది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రిన్స్ బాక్సాఫీస్ వద్ద తన ‘ఖలేజా’ చూపించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ గతంలో చేసిన ‘అతడు’ ఆయన కెరీర్‌లోనే అందరి మన్ననలు అందుకున్న చిత్రంగా నిలిచింది. ఆ చిత్రాన్ని అధిగమించే స్థాయిలో ‘ఖలేజా’ ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన సింగనమల రమేష్‌బాబు అంటున్నారు.

అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి మరో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ -‘‘బడ్జెట్ పరంగా, క్వాలిటీ పరంగా, రెవిన్యూ పరంగా, పెర్‌ఫార్మెన్స్ పరంగా... ‘మహేష్ ఖలేజా’ నంబర్‌వన్‌గా నిలుస్తుంది. ఇది నమ్మకంతో చెబుతున్న మాట. మహేష్ తప్ప ఎవరూ ఈ పాత్రను ఆ స్థాయిలో పోషించలేరు అనిపించే స్థాయిలో ఇందులో ఆయన నటన సాగింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మించిన ఈ చిత్రం అందరి అంచనాలనూ అందుకుంటుందని నమ్మకంతో ఉన్నాం. మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం ఇచ్చారు.

ఇప్పటివరకూ మహేష్-మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఆడియోలన్నింటికంటే బెటర్‌గా ఈ చిత్రానికి మణిశర్మ పాటలు అందించారు. ఈ నెల 27న పాటలను, అక్టోబర్ 7న సినిమాను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, నాజర్, డా.బ్రహ్మానందం, సునీల్, అలీ, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, సుధ, శ్రీరంజని తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.భట్, ఆర్ట్: ఆనంద్‌సాయి, సమర్పణ: సత్యరామమూర్తి.


మహేష్ బాబుతొ సంభాషన

రెండేళ్లుగా నిర్మాణంలో ఉండి, ఏడాది కాలంగా ఊరిస్తూ వస్తున్న "మహేష్ ఖలేజా" మూడేళ్ల విరామం తర్వాత విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 24న ఈ చిత్రం ఆడియోను మార్కెట్లో విడుదల చేయనున్నారు. వచ్చే నెల 6న సినిమా విడుదల కానున్నదని సమాచారం. అయితే మహేష్ బాబు పలు యాడ్‌లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాదులో అమృతాంజన్ ప్రకటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పారు. అవి మీకోసం...

ఖలేజా అంటే ఏమిటి..? ఎలా ఉంటుంది..? 
టైటిల్‌కు తగినట్లే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నా కెరీర్‌లో ఇప్పటివరకూ నేను చేయని అత్యంత వైవిధ్యభరిత చిత్రంగా ఖలేజాను వర్ణిస్తాను. ఇంతకుముందు నేను చేసిన పాత్రలకు భిన్నంగా చాలా పెద్దదిగా, ఫన్నీగా మాట్లాడుతుండే టాక్సీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాను ఈ చిత్రంలో. 

ఇదొక పూర్తి నిడివి వ్యాపారాత్మక చిత్రం. ఇందులో సందేశాలుండవు, స్పీచ్ లుండవు. పైట్స్ కోసం ఫైట్లు అన్నట్లుగా కాకుండా ఈ చిత్రంలోని ఫైట్స్ అన్నీ స్టోరీని సెపరేట్ చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకులు ఆస్వాదించే అన్ని అంశాలు సమపాళ్లలో కలగలిసిన చిత్రం ఖలేజా.

గ్యాప్‌లో మీరు నేర్చుకున్నదేమిటి...? 
నేను నటించిన చిత్రం మూడేళ్ల గ్యాప్‌తో విడుదల కావడం నా అభిమానులుకి కొంత నిరాశకు గురి చేస్తుండవచ్చు. కానీ.. ఒక నటుడిగా, వ్యక్తిగా నేను ఇది నాకు ఆనందన్నిచ్చే విషయమైతే.. నాకు అమితంగా బాధ కలిగించిన విషయం నేను ప్రాణప్రదంగా ప్రేమించే మా అమ్మమ్మను పోగొట్టుకోవడం. 

అలాగే మా అత్తమామలను( నమ్రత తల్లిదండ్రులు) కోల్పోవడం నన్నెంతగానో బాధించింది. ఈ పరిణామాలన్నీ నా మీద ఎంతగానో ప్రభావం చూపాయి. అయినా సరే నేను నిబ్బరంగా ఉండగలిగానంటే అందుక్కారణం మా నాన్నే. నాకు ఊహ తెలిసేనాటికి ఆయన చాలా పెద్ద హీరో. 

ఫ్యాన్స్ చూపే అభిమానం, ఆదరణ అపూర్వం. తను అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఇంట్లో ఎప్పుడూ చాలా సాదాసీదాగా ఉండేవారు. అలాగే ఈరోజున నేను హీరోనయ్యానంటే అది కేవలం మా నాన్న చలవే. నా చదువు పాడవకుండా ప్రతి వేసవిలో నాతో ఒక సినిమా చేయిస్తూ వచ్చారు. నేను హీరోనయ్యానన్నా, బాగా నటిస్తానని పేరుతెచ్చుకుంటున్నా.. వాటన్నిటికీ నానే కారణం.

గౌతమ్‌ను సినిమాల్లోకి తెచ్చే ఆలోచన ఉందా.. 
భవిష్యత్‌లో ఏమవుతాడో ఎవరూ చెప్పలేం. ప్రస్తుతం ఇంకా చిన్నపిల్లవాడే. నాలుగేళ్ల వయసుకే భవిష్యత్‌లో పెద్ద హీరో అయ్యే లక్షణాలు కనబరుస్తూ ఉంటాడు. గౌతమ్ పుట్టాకే నా జీవితానికో అర్థం, పరమార్థం లభించిందని నేను భావిస్తాను. నాకు లభించిన వెలకట్టలేని ఒక గొప్ప బహుమతి గౌతమ్.. వాడు నా బిడ్డ మాత్రమే కాదు... నా సర్వస్వం. అసలు నా దృష్టిలో పితృత్వం పొందని పురుషుడు పరిపూర్ణుడ కాలేరు.

మీ ముందున్న ప్రధాన లక్ష్యాలు..? 
ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం జాతీయ అర్డును సాధించడం. నేషనల్ అవార్డ్ అందుకోవాలన్నది నా కోరిక. నా కల. అవి ఎప్పటికి నెరవేరుతాయో నాకు తెలీదు. అయితే కలగనడంలో తప్పు లేదు కదా..

మీకు ఇష్టం లేనివి ఏమిటి...? 
అబద్ధాలాడేవారంటే నాకు అసహ్యం. నేను ఎలాంటి వారినైనా భరిస్తాను కానీ, అబద్ధాలాడేవారిని మాత్రం అస్సలు సహించలేను. అటువంటి వాళ్లంటే నాకు పరమ అసహ్యం. అబద్ధాలాడే పరిశ్రమ, మోసం చేసేవాళ్లను నా దరిదాపులకు కూడా రానీయను. నాతో కలిసి పనిచేసే వాళ్లంతే నిజాయితీ, నిబద్ధత కలిగి నిపుణులై ఉండాలని కోరుకుంటాను. 

మీ జీవిత భాగస్వామిలో నచ్చిన అంశమేమిటి..? 
వంశీ సినిమా షూటింగ్ కోసం మేము 40 రోజులపాటు ఫారిన్ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్ ముగిసే చివరి రోజున కానీ, ఈ 40 రోజుల్లో మా మధ్య విడదీయలేనంతగా అనుబంధం ఏర్పడిపోయిందని గుర్తించలేకపోయాం. నమ్రతతో నేను ప్రేమలో పడిన క్షణాలు మరువలేనివి. అయితే దీనిపై నన్నెవరైనా అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అదలా జరిగిపోయిందంతే.


ఆమె సింప్లిసిటీ నాకిష్ట. ఆమెలోని స్వచ్ఛత అంటే మరీమరీ ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం పెళ్లిచేసుకుందాం అని నేనెప్పుడూ నమ్రతకు చెప్పలేదు. నాన్న, అమ్మల అంగీకారం తీసుకోవడం కోసం నమ్మతను నేనిష్టపడుతున్నాననీ, ఆమెతో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానని చెప్పాను. 

అప్పుడు నమ్రత గురించి నాన్న వాకబు చేశారు. ఆ తర్వాత 2005 ఫిబ్రవరిలో నేనూ నమ్రత పెళ్లి చేసుకున్నాం. ఆమె నా జీవిత భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం. అయిదేళ్లపాటు డేటింగ్ చేశాక మా ఇద్దరి పెళ్లి జరిగింది. పెళ్లై అయిదేళ్లయింది. మేమిద్దరం గడిపే ప్రతి క్షణం మా బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. నమ్రత నాకు భార్య మాత్రమే కాదు.. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా.

పూర్వజన్మల గురించి నమ్ముతారా.. 
దేవుడిని ఎలా నమ్ముతామో.. పూర్వజన్మలున్నాయనీ నమ్ముతాను. మా నాన్నను నేను ప్రేమించడం మాత్రమే కాదు ఎంతో గొప్పగా ఆరాధిస్తాను. ఆయన వ్యక్తిత్వం, నిరాడంబరత్వం అలవచుకునేందుకు నేనెప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. కృష్ణగారబ్బాయిగా జన్మించడం పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యఫలంగా నేను భావిస్తాను

ఖలేజా



'అతడు' తరువాత మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఖలేజా'. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతోంది. మహేష్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా కనిపిస్తారని సమాచారం. ఆయన హావభావాలు, పోరాటాలతోపాటు... అనుష్క అందాలు... మణిశర్మ సంగీతం ప్రేక్షకుల్ని మెప్పిస్తాయని చిత్ర బృందం చెబుతోంది. వీటికి తోడు త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు అదనపు బలం. త్వరలోనే పాటల్ని ఆవిష్కరించి 'ఖలేజా' విడుదల తేదీని ఖరారు చేస్తారు.

మహేష్‌ 'ఖలేజా'

‘‘మహేష్ ‘ఖలేజా’ ఏంటో తెలిపే సినిమా ఇది. మహేష్ మాత్రమే చేయగలరు అనిపించే స్థాయిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన పాత్రను తీర్చిదిద్దారు.

మహేష్ అభిమానులనే కాక, అందరినీ అలరించే సినిమా ఇది’’ అంటున్నారు నిర్మాతల్లో ఒకరైన సింగనమల రమేష్‌బాబు.

సి.కళ్యాణ్‌తో కలిసి ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.

త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఇవి...

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates