Who Is Tollywood No1 Hero

మెగాస్టార్ చిరంజీవి రాజకీయరంగ ప్రవేశానంతరం తెలుగు సినీరంగంలో నెంబర్‌వన్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఆయనకు ప్రత్యామ్నాయంగా ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారన్నది నిర్వివాదాంశం. అగ్ర హీరోల అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా తెలుగు సినిమా ‘అగ్ర కథానాయకుడు’ ఎవరనే విషయంలో ఎవరూ నిశ్చితాభివూపాయానికి రాలేకపోతున్నారు. నెంబర్‌వన్ స్థానాన్ని నిర్ణయించడానికి ఖచ్చితమైన ప్రామాణికాలు ఏమిటి? అనే అంశంలో కూడా ఎవరికీ స్పష్టత లేదు.

తారలు తీసుకునే పారితోషికాల ప్రాతిపదికనే నెంబర్‌వన్ స్థానాన్ని నిర్ణయించడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా విజయాలతో పాటు తారల పారితోషికాలు పెరగడం సహజం. దాంతో నెంబర్‌వన్ స్థానాన్ని నిర్ణయించడానికి పారితోషికాన్నే ప్రామాణికంగా భావించాల్సి వస్తోంది. ఆ ప్రకారం తెలుగు సినిమా నెంబర్‌వన్ రేసులో పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు పోటీపడుతున్నారు. వీరిద్దరూ కమర్షియల్‌గా భారీ విజయాల్ని సొంతం చేసుకున్న కథానాయకులే.

ఒక్కో సినిమాకు వీరు దాదాపు 14 నుంచి 15కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నారు. తెలుగు ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఒక సినిమాలో నటించడానికి మహేష్‌బాబుకు ఓ కార్పొరేట్ కంపెనీ 17 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వజూపిందని తెలిసింది. ఇదిలావుండగా ‘అత్తారింటికి దారేది’ విజయంతో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించారు పవన్‌కల్యాణ్. ఈ సినిమాతో ఆయన ఇమేజ్ శిఖరాక్షిగానికి చేరుకుంది. దాంతో ఆయనకు కూడా ఓ కార్పొరేట్ సంస్థ 1 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిందని సమాచారం. ‘దూకుడు’ ‘బిజినెస్‌మేన్’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలతో మహేష్‌బాబు, ‘గబ్బర్‌సింగ్’ ‘అత్తారింటికి దారేది’ చిత్రాలతో పవన్‌కల్యాణ్ విజయపథంలో దూసుకెళ్తున్నారు. దీంతో నెంబర్‌వన్ రేసులో ఇద్దరి మధ్యే పోటీవుందని తెలుగు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates