Profile


జన్మ నామం : ఘట్టమనేని మహేశ్ ‌బాబు
జననం :ఆగష్టు 9 1974 (1974-08-09)
భారత దేశం చెన్నై, భారతదేశం
ఇతర పేర్లు : ,సూపర్ స్టార్ (పోకిరి సినిమా నుండి)
భార్య :నమ్రతా శిరోడ్కర్
ప్రముఖ పాత్రలు : ఒక్కడు (2003)లో అజయ్
నిజం(2003)లో సీతారాం
అతడు (2005)లో నందగోపాల్
పోకిరి (2006)లో పండు


ఘట్టమనేని మహేశ్ బాబు (ఆగష్టు 9, 1974) తెలుగు సినీ నటుడు మరియు ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు। ఈయన ఆగష్టు 9, 1974 లో చెన్నై నగరంలో జన్మించాడు.

విషయ సూచిక

* 1 ప్రస్తుతం
* 2 పూర్వరంగం
* 3 సినీ జీవితం
* 4 పురస్కారాలు
* 5 సినీ జాబితా
* 6 మూలాలు

ప్రస్తుతం





ప్రిన్స్ మహేష్‌బాబు నటించే కొత్త చిత్రం షూటింగ్ అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. పర్షియన్ గల్ఫ్‌లోని బహ్రెయిన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలిసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన "అతడు" ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బహ్రెయిన్‌లో జరిగే ఈ సినిమా తొలి షెడ్యూల్‌లో మేజర్ యాక్షన్ పార్ట్‌‍ని చిత్రీకరిస్తారు. అలాగే రెండు పాటలను కూడా తెరకెక్కిస్తారు. మహేష్‌బాబుకు జంటగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తారు. ఇందులో ఒక హీరోయిన్ పార్వతీ మెల్టన్ కాగా, మరొకరిని ఎంపిక చేయాల్సివుంది.

మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బహ్రెయిన్‌లో తొలి షెడ్యూల్ పూర్తికాగనే, చిత్ర యూనిట్ తరువాత రాజస్థాన్ చేరుకుంటుంది. రెండో షెడ్యూల్ మొత్తం రాజస్థాన్‌లోనే జరుగనున్నట్టు సమాచారం. సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామా కథతో రూపొందుతున్నట్టు తెలిసింది.
పూర్వరంగం

ఇతను ప్రఖ్యాత తెలుగు సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ మరియు ఇందిరాదేవిల కుమారుడు. ఇతనికి ఒక అన్నయ్య రమేశ్, ఇద్దరు అక్కలు (పద్మావతి మరియు మంజుల) మరియు ఒక చెల్లెలు ప్రియదర్శని గలరు. హిందీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ ఇతని భార్య. వీరి కుమారుడు గౌత

సినీ జీవితం

మహేష్ బాబు నటనాజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. డిగ్రీ పూర్తి అయ్యాక సినిమా రంగానికి తిరిగివచ్చాడు. హీరోగా మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలి_బింద్రే సరసన కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ 2002 మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన టక్కరి దొంగ, బాబీ రెండూ కూడా పరాజయం పాలయ్యాయి.

2003లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ఒక్కడు చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. భూమిక కథానాయికగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన నిజం చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో నటనకు గానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నారు. 2004లో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే ఏడు విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదని ఛెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయ్యిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.

అటు పిమ్మట మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. అతడు చిత్ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. 2005లో విడుదల అయ్యిన అతడు చిత్రం తెలుగునాట మాత్రమే కాక, విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. స్వతహాగా మంచివాడయ్యినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి బంగారు నంది లభించింది. 2006లో మహేష్ నటించిన చిత్రం పోకిరి విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఆశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీదిగ్గజాలుగా పేరెన్నికగన్న అమితాబ్ బచ్చన్, రాం గోపాల్ వర్మ తదితరులెందరో మహేష్ నటనను శ్లాఘించారు . ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు.

పోకిరీ తరువాత నిర్మాణం అయ్యిన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.

పురస్కారాలు

నటునిగా మహేష్ వయసు తక్కువే అయినా ఇతని నటనా పటిమకు అది అడ్డంకి కాలేదు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుండి మహేష్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

* ఉత్తమ నూతన నటుడు: రాజకుమారుడు (1999)
* ఉత్తమ నటుడు (స్పెషల్ జ్యూరీ) : మురారి (2001)
* ఉత్తమ నటుడు (స్పెషల్ జ్యూరీ) : టక్కరి దొంగ (2002)
* ఉత్తమ నటుడు బంగారు నంది : నిజం (2002)
* ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: ఒక్కడు (2002)
* ఉత్తమ నటుడు (స్పెషల్ జ్యూరీ ): అర్జున్ (2004)
* ఉత్తమ నటుడు బంగారు నంది : అతడు (2005)
* ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు అర్హత: అతడు (2005)
* ఫిలింఫేర్ఉత్తమ తెలుగు నటుడు: పోకిరీ (2006)

సినీ జాబితా
సంవత్సరం సినిమాపేరు పాత్రపేరు
2010 ఖలేజా సీతారామరాజు
2007 అతిధి అతిధి
2006 సైనికుడు సిధ్ధార్థ
పోకిరి పండు / కృష్ణ మనోహర్
(విజేత, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు))

2005 అతడు నంద గోపాల్
(విజేత, ఉత్తమ నటుడు నంది పురస్కారం పురస్కారం ఉత్తమ నటుడు (తెలుగు)
2004 అర్జున్ అర్జున్ విజేత, ఉత్తమ నటుడు
నంది పురస్కారం, ప్రత్యేకజ్యూరీ
నాని నాని
2003 నిజం రామా విజేత, ఉత్తమ నటుడు నంది పురస్కారం
ఒక్కడు అజయ్ విజేత, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు)
2002 బాబి బాబి
టక్కరి దొంగ రాజా విజేత, ఉత్తమ నటుడు నంది పురస్కారం, ప్రత్యేక జ్యూరీ
2001 మురారి మురారి విజేత, ఉత్తమ నటుడు నంది పురస్కారం, ప్రత్యేక జ్యూరీ
2000 వంశి వంశి
యువరాజు శ్రీనివాస్
1999 రాజకుమారుడు రాజా విజేత, నంది బహుమతి - ఉత్తమ నూతన నటుడు

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates