Mahesh Babu, Encounter Specialist, Aagadu, Sreenu Vaitla, శ్రీనువైట్ల, ఆగడు, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, మహేష్ బాబు
మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆగడు’. తమన్నా కథానాయిక. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజాకార్యక్షికమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా శంకర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసింది. దూకుడు’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి తెలంగాణ యాసలో డైలాగ్‌లు చెప్పిన మహేష్ ఈ సినిమాలో రాయలసీమ స్లాంగ్‌ని అనుకరిస్తాడని చిత్ర వర్గాల సమాచారం.
మాస్ అంశాలుంటూనే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 2 నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. అత్యుత్తమ నిర్మాణ విలువలతో తెరకెక్కనున్న చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్‌లో ఏప్రిల్‌లోగా పూర్తి చేసి వేసవి కానుకగా మే నెలలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ముందు శ్రీహరిని అనుకున్నారు. ఆయన హఠాన్మరణం కారణంగా ఇప్పుడు ఆ పాత్రకు సాయికుమార్‌ని తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో మహేష్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్‌గా కనిపిస్తారని ఫిలిమ్‌నగర్ సమాచారం.
ముఖ్యతారాగణం: రాజేంవూదవూపసాద్, బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, సాయికుమార్, నెపోలియన్‌లతో పాటు ఇతర ముఖ్యతారాగణం
రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్
రచనా సహకారం: ప్రవీణ్‌వర్మ
ఛాయా గ్రహణం: కె.వి.గుహన్
ఆర్ట్: ఎ.ఎస్‌పకాష్
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ
సంగీతం: తమన్
కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.
0 comments:
Post a Comment