2013, 2014, Mahesh Babu, Shooting, Sukumar, Prince, Prince Mahesh, Super star Mahesh
'దూకుడు', 'బిజినెస్‌మేన్', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు'... ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మహేష్‌బాబు. రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో, మరో రెండు కథాచర్చల్లో ఉన్నాయి. అందులో '1' (నేనొక్కడినే) ప్రస్తుతం గోవా తీరంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్ కథానాయిక. సుకుమార్ దర్శకుడు. గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్ హెయిన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.
0 comments:
Post a Comment