Mahesh babu, bollywood, Raj Nidimoru, Krishna D.K, Aswini Dutt, అశ్వనీదత్, మహేష్ బాబు, రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె, బాలీవుడ్, Prince, Prince Mahesh, Superstar, Superstar Mahesh
మహేష్‌బాబు కథానాయకుడిగా వైజయంతి మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కృష్ణ నిడిమోరు, రాజ్ డి.కె. దర్శకత్వం వహిస్తారు. సి.అశ్వనీదత్ నిర్మాత. ''మహేష్‌తో ఇది మా మూడో చిత్రం. 2014 ప్రధమార్ధంలో సినిమాని ప్రారంభిస్తాం. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం. మహేష్‌బాబు శైలి, ఇమేజ్‌కి తగిన కథ సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతామ''న్నారు అశ్వనీదత్. ప్రస్తుతం '1' (నేనొక్కడినే) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మహేష్. ఇటీవలే 'ఆగడు' కూడా మొదలైంది. డిసెంబరులో '1' చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తరవాత వైజయంతి మూవీస్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
0 comments:
Post a Comment