మహేష్‌తో పూరి చిత్రం

డచిన దశాబ్దంలో తెలుగు సినిమా వసూళ్ల స్థాయిని చాటిన చిత్రం 'పోకిరి'. కొత్త దశాబ్దం ప్రారంభంలో 'పోకిరి' జోడీ నుంచి ఓ చిత్రం రూపొందబోతోంది. ఆ సినిమా పేరు చెప్పగానే మహేష్‌బాబు, దర్శకుడు పూరి జగన్నాథ్‌లే గుర్తుకొస్తారు. మరోసారి వాళ్లిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుంది. మే మాసంలో ఈ చిత్రం మొదలవుతుంది. మహేష్‌బాబు మాట్లాడుతూ ''పూరి చెప్పిన కథ నచ్చింది. కొత్తదనంతో ఉందా కథ. 'పోకిరి' తరవాత మా నుంచి వచ్చే ఆ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద''న్నారు. ''నేను వినిపించిన కథ మహేష్‌ని ఆకట్టుకుంది.  
ఇది మా ఇద్దరి కెరీర్‌లో మంచి చిత్రంగా నిలిచిపోతుంద''న్నారు దర్శకుడు. నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ ''2011లో మా సంస్థ చేయబోయే భారీ చిత్రమిది. నటీనటుల, సాంకేతిక నిపుణులను త్వరలోనే ప్రకటిస్తామ''న్నారు.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates