ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, స్టార్ రైటర్, డైరక్టర్ త్రివిక్రమ్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన అతడు తర్వాత చేస్తోన్న మరో భారీ చిత్రంగా ఇది తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్. సత్యరామమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ "ప్రొడక్షన్ నెం.2" చిత్రంలో మహేష్ బాబు సరసన అనుష్క కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ అతడు హిట్ తర్వాత త్రివిక్రమ్ చెప్పిన కొత్త సబ్జెక్ట్ తనకు ఎంతో బాగా నచ్చిందని, కథ విని సంతృప్తి చెందడం వల్లే ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను అలరించే అన్ని అంశాలతో, అత్యున్నత ప్రమాణాలతో రూపొందనుందని మహేష్ బాబు తెలిపారు. హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ మహేష్ బాబుతో కలిసి చేస్తున్న తొలి...