మహేష్‌ - త్రివిక్రమ్‌ల చిత్రo యొక్క పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు




నకరత్న మూవీస్‌ సంస్థ మహేష్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క నాయిక. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శింగనమల రమేష్‌బాబు నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసరాల్లో సాగుతోంది. మహేష్‌ - త్రివిక్రమ్‌ల కలయికలో 'అతడు' తరవాత సిద్ధమవుతున్న చిత్రమిదే. త్వరలో మహేష్‌పై పోరాట సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వినోదం, యాక్షన్‌ అంశాలు మేళవించిన కథ అని సమాచారం. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు, తనికెళ్ళ భరణి, షఫి, సుశీల్‌ శర్మ, సుధ, శ్రీరంజని తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates