మహేష్‌ చిత్రం ప్రారంభం

హేష్‌బాబు కథానాయకుడిగా 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ఈ చిత్రం లాంఛనంగా సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు శ్రీను మాట్లాడుతూ ''మహేష్‌బాబుని ఇప్పటి వరకూ ఎవరూ చూడని కోణంలో ఆవిష్కరిస్తాం. సరదాగా... హృదయాన్ని హత్తుకొనేలా ఉండే ప్రేమ కథ ఇది. యాక్షన్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయి. సాంకేతికంగానూ ఉన్నత విలువలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతామ''న్నారు. ''నమో వెంకటేశ తరవాత మా సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. మాకిది ప్రతిష్ఠాత్మకమైన చిత్రం. వచ్చే నెల 15 నుంచి షూటింగ్‌ ఉంటుంది. సంక్రాంతికి విడుదల చేస్తామ''ని నిర్మాతల్లో ఒకరైన గోపీచంద్‌ తెలిపారు. సమర్పణ: కృష్ణ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌.

హేష్‌బాబు ట్విట్టర్‌లో అడుగుపెట్టిన తర్వాత తన సినిమాల గురించి ఎప్పటి కప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అనుష్క కథానాయిక. ప్రస్తుతం పుణెలో పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా గురించి మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో రాసుకున్నారు. ''షూటింగ్‌ జరుగుతున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు తెరకెక్కిస్తున్న పతాక సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. ఇందులో ప్రకాష్‌రాజ్‌ నటన అందరికీ నచ్చుతుంది. 'అతడు' తర్వాత త్రివిక్రమ్‌తో పని చేయడం మరింత ఆనందంగా ఉంది. అతి తొందర్లోనే మంచి సినిమాతో అభిమానుల ముందుకొస్తాను'' అని ట్విట్టర్‌లో రాసుకున్నారు. అన్నట్టు మహేష్‌బాబుకి దైవం మీద గాలి మళ్లింది. ఓ పక్క షూటింగ్‌లో పాల్గొంటూనే పుణె చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాల్ని కూడా దర్శించుకుంటున్నారు.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates