మహేష్‌బాబు ట్విట్టర్‌లో అడుగుపెట్టిన తర్వాత తన సినిమాల గురించి ఎప్పటి కప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అనుష్క కథానాయిక. ప్రస్తుతం పుణెలో పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా గురించి మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో రాసుకున్నారు. ''షూటింగ్ జరుగుతున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు తెరకెక్కిస్తున్న పతాక సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. ఇందులో ప్రకాష్‌రాజ్ నటన అందరికీ నచ్చుతుంది. 'అతడు' తర్వాత త్రివిక్రమ్‌తో పని చేయడం మరింత ఆనందంగా ఉంది. అతి తొందర్లోనే మంచి సినిమాతో అభిమానుల ముందుకొస్తాను'' అని ట్విట్టర్‌లో రాసుకున్నారు. అన్నట్టు మహేష్‌బాబుకి దైవం మీద గాలి మళ్లింది. ఓ పక్క షూటింగ్‌లో పాల్గొంటూనే పుణె చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాల్ని కూడా దర్శించుకుంటున్నారు.
0 comments:
Post a Comment