ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించడం మహేష్‌బాబు పద్ధతి. హీరోయిజాన్ని హిమాలయ పర్వమంత ఎత్తులో చూపించడం ఎస్.ఎస్.రాజమౌళి శైలి. వీళ్లిద్దరూ కలిస్తే యాక్షన్ సినిమా ప్రియులకు పండగే! త్వరలో మహేష్ - రాజమౌళి కలయికలో ఓ చిత్రం రాబోతున్నట్లు తెలుగు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే మహేష్ ఇంటికి వెళ్లారు రాజమౌళి. ఆ సందర్భంలో ఆయన ఓ కథాంశాన్ని వినిపించారు. మహేష్ కూడా దీనిపై ఎంతో ఆసక్తిని కనబరిచారు. వీరిద్దరి నుంచి వచ్చే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియడానికి కొంత సమయం పట్టొచ్చు. ప్రస్తుతం రాజమౌళి 'మర్యాద రామన్న'కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆయన తరహాకి భిన్నంగా దీన్ని రొమాంటిక్ కామెడీగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం పూర్తి కావచ్చింది. సంక్రాంతికి వచ్చేలా శ్రీను వైట్ల చిత్రం ఉంటుంది.
0 comments:
Post a Comment