సృజనాత్మక దర్శకుడిగా పేరొందిన మణిరత్నం చాలావరకూ తమిళ కథానాయకులు లేకపోతే హిందీ నటులతోనే చిత్రాలు రూపొందిస్తారు. ఆయన తెలుగు కథానాయకుడితో రూపొందించిన చిత్రం 'గీతాంజలి' మాత్రమే. ఆ తరవాత మణి ఎప్పుడూ మన కథానాయకులతో చిత్రాలు చేయలేదు.ఈ యేడాది మహేష్‌బాబుతో ఆయన ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మణిరత్నం - మహేష్‌బాబుల మధ్య చర్చలు కూడా నడిచాయి. చిత్రానికి సంబంధించిన సంగతులు మాట్లాడుకొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని మహేష్ ట్విట్టర్‌లో సంక్షిప్తంగా రాసుకొన్నారు.''నా కల నెరవేరుతోంది. మణిరత్నంతో పని చేయడం సంతోషంగా ఉంది'' అని అందులో పేర్కొన్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ భాషలోనూ రూపొందుతుందని సమాచారం.
0 comments:
Post a Comment