మహేష్‌బాబు, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. హైదరాబాద్‌లో పాటను చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పద్మాలయ స్టూడియోలో ఇందు కోసం ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఆ తరవాత విదేశాల్లో పాటను చిత్రిస్తారని సమాచారం. ఇటీవలే హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మహేష్‌బాబు నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఘట్టాలను నగరంలోని పాతబస్తీలో చిత్రీకరించారు. చిత్రీకరణ తుది దశకు చేరుకొంది. ''మహేష్‌బాబు శైలికి తగ్గ యాక్షన్, వినోదాంశాలతో కూడిన చిత్రమిది. ఆయన హావభావాలు కూడా ఇందులో వైవిధ్యంగా ఉంటాయి. 'నీ దూకుడు సాటెవ్వడు...' అంటూ సాగే టైటిల్ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద''ని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సంగీతం: తమన్.