బాలీవుడ్ ఫ్యాషన్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంతో మరోసారి కోలీవుడ్‌కు రానుంది. అదీ తెలుగుస్టార్ ప్రిన్స్ మహేష్‌బాబు సరసన మెరవనుందని కోలీవుడ్ సమాచారం. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ నవలను తెరకించనున్న విషయం తెలిసిందే. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రంలో విజయ్, ఆర్య, తెలుగు స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఎంపికయ్యారు. ఒక హీరోయిన్‌గా అందాల తార అనుష్క ఎంపికైనట్లు తెలుస్తోంది.
మరో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రాను ఎంపిక చేసే ప్రయత్నంలో మణిరత్నం ఉన్నారు. ఈ ఫ్యాషన్ క్వీన్‌తో ఇప్పటికే మణిరత్నం మాట్లాడినట్లు ఆమె కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా ప్రియాంక ఇంతకు ముందే విజయ్‌కు జంటగా తమిళన్ అనే చిత్రంలో నటించారు. కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో విజయ్‌కు జంటగా అనుష్క నటించనున్నట్లు, ఆమెకు అన్నగా నటించే మహేష్‌కు ఫెయిర్‌గా ప్రియాంకా చోప్రా నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
ప్రియాంక బాలీవుడ్‌లో యమ బిజీగా ఉన్నా మణిరత్నం చిత్రాన్ని వదులుకోదలచుకోలేదట. త్వరలో ఆమె చెన్నై వచ్చి మణితో చర్చించడానికి సిద్ధం కానున్నారని తెలిసింది.
0 comments:
Post a Comment