Tamanna Out From Mahesh Sukumar Movie

దూకుడు, బిజినెస్‌మేన్ చిత్రాల వేడి పూర్తిగా చల్లారనేలేదు. అప్పుడే మరో సంచలనానికి తెరతీశారు మహేష్‌బాబు. ఓ వైపు వెంకటేష్‌తో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’లో నటిస్తూ... మరో వైపు సుకుమార్ చిత్రానికి కూడా రంగం సిద్ధం చేసేశారు. మహేష్‌తో ‘దూకుడు’ లాంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట త్రయం నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది.

దిల్‌రాజు, ఎస్.ఎస్.రాజమౌళి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో మహేష్ సరసన ఓ కొత్త అమ్మాయిని నటింపజేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం రత్నవేలు. సుకుమార్‌తో ఆర్య, ఆర్య2 చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన రత్నవేలు... రజనీకాంత్ ‘రోబో’తో సంచలన ఛాయాగ్రహకునిగా మారారు.

సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు... ఈ ముగ్గురూ మహేష్‌తో పనిచేయడం ఇదే ప్రధమం. మహేష్ ఇమేజ్‌ని రెట్టింపు చేసే విధంగా అద్భుతమైన కథతో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిసింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates