రాజమౌళి దర్శకత్వంలో నటిస్తా

''విశ్వరూపం' వివాదాల్లో చిక్కుకోవడం దురదృష్టకరం. కమల్‌హాసన్‌కి నేను వీరాభిమానిని. అంత పెద్ద నటుడు కంటతడి పెట్టడం చాలా బాధనిపించింద''న్నారు ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు. ఆయన నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో మహేష్‌ విలేకరులతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ''కమల్‌హాసన్‌ నటించిన 'విశ్వరూపం' చిత్రాన్ని నేను ఇంకా చూడలేదు. ఆ సినిమాకి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుకొంటున్నాన''న్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి చెబుతూ ''సహజత్వంతో కూడిన కథ ఇది. యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుంది. సుకుమార్‌ ఇదివరకు చేసిన చిత్రాలకి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ ''శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమా వచ్చే నెలలో ప్రారంభమవుతుంది....

నెంబర్‌వన్ ఎవరనేది ప్రేక్షకులే నిర్ణయించాలి!

‘సీతమ్మ వాకిట్లో...’ చిత్రాన్ని మల్టీస్టారర్ అంటే ఒప్పుకోను. మంచి సినిమా అది. వాణిజ్య సూత్రాల ప్రకారం మల్టీస్టారర్ అంటే ఇద్దరు హీరోలకు రెండేసి ఫైట్స్, రెండు ఐటమ్‌సాంగ్‌లు వుంటాయి. అవేవీ ఈ సినిమాలో లేవు. కథలోని కుటుంబ విలువలు, హృదయానికి హత్తుకునే సున్నితమైన భావోద్వేగాలు నచ్చి ‘సీతమ్మ వాకిట్లో...’ సినిమా చేయడానికి అంగీకరించాను’ అన్నారు మహేష్‌బాబు. ‘దూకుడు’ ‘బిజినెస్‌మెన్’ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల ద్వారా వరుస విజయాలతో దూసుకుపోతున్నారాయన. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా చిత్రీకరణలో వున్నారు మహేష్‌బాబు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ విజయాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లో మహేష్‌బాబు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి... మీ చిత్రాల శైలికి భిన్నంగా ‘సీతమ్మ వాకిట్లో...’ చేశారు. సినిమా విజయం ఎలాంటి అనుభూతినిస్తోంది?నా దృష్టిలో ‘సీతమ్మ వాకిట్లో...’...

Pages 311234 »

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates