Romantic Thriller 1 Nenokkadine

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వన్’. ‘నేనొక్కడినే’ అనేది ఉపశీర్షిక. సుకుమార్ దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. కృతిసనన్ కథానాయిక.

రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్‌స్టార్‌గా వినూత్న పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేష్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని, తొలిసారిగా ఆయన ఆరుపలకల దేహంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఇటీవలే బ్యాంకాక్‌లో కీలక ఘట్టాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

త్వరలో సముద్రతీర పట్టణం మంగుళూరులో సినిమాకు సంబంధించిన ప్రధాన పోరాట ఘట్టాల చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నౌకాక్షిశయం, బీచ్‌లలో ఈ పోరాటాలను తెరకెక్కించాలనే ఆలోచనలో చిత్ర దర్శకుడు సుకుమార్ ఉన్నారు. ఈ నెల 25 నుంచి మంగుళూరు షెడ్యూల్ ప్రారంభమవుతుందని చిత్ర వర్గాల సమాచారం. నవంబర్‌లోగా చిత్రీకరణను పూర్తిచేసి డిసెంబర్ రెండవవారంలో ఆడియోను ప్రేక్షకుల ముందుకుతీసుకురావడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. షాయాజీషిండే, కెల్లిడోర్జ్, విక్రమ్ సింగ్, శ్రీనివాసడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫి: రత్నవేలు, సంగీతం: దేవీశ్రీవూపసాద్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates