మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రారంభమైన చిత్రం లేటుగా ప్రారంభమైనా టైట్ షెడ్యూల్తో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ పదిహేను రోజులు పాటు బ్యాంకాక్ లో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించుకుని వచ్చారు. ఇప్పుడు మహేష్, అనూష్క కాంబినేషన్లో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణకోసం రాజస్ధాన్ వెళ్తున్నారు. జూన్ ఇరవై మూడు నుంచి ఆగస్టు ఆరు వరకు దాదాపు నలభై అయిదు రోజుల పాటు అక్కడ షూటింగ్ జరుగుతుంది. మేజర్ పార్ట్ రాజస్ధాన్ ఎడారుల్లో షూట్ చేస్తారని తెలుస్తోంది. వీటి గురించి నిర్మాత శింగనమల రమేష్ మాట్లాడుతూ ఆ సన్నివేశాలే సినిమాలో కీలకం..ప్రేక్షకులను ధియోటర్లలో కట్టిపారేస్తాయని బావిస్తున్నాం అన్నారు. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
0 comments:
Post a Comment