మహేష్‌బాబు తన అభిమానులకు అందుబాటులో ఉండేందుకు ట్విట్టర్‌ని వేదికగా చేసుకున్నారు. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా తన భావాలను వెల్లడిస్తూ ప్రస్తుతం చేస్తున్న సినిమా కబుర్లని పంచుకొంటున్నారు. బ్లాగ్‌లు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల సాయంతో అందరికీ అందుబాటులో ఉండే సంస్కృతి టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో అగ్ర తారలు ట్విట్టర్, ఆర్కుట్, ఫేస్‌బుక్‌ల్లో చాట్ చేస్తున్నారు. సొంత బ్లాగులు కూడా నిర్వహిస్తున్నారు.ఇటీవలే తనని కలిసిన అభిమానులతో మహేష్ ట్విట్టర్ విశేషాల్ని వెల్లడించారు. అందులో మహేష్ తన కుమారుడు గౌతమ్‌తో ఉన్న ఫొటోల్ని కూడా ఉంచారు.
0 comments:
Post a Comment