క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ అన్నారు. ఫేవరేట్ క్రికెటర్ అంటూ ప్రత్యేకించి ఎవ్వరూ లేరని ఆమె చెప్పారు.
క్రికెట్ అంటేనే సమిష్టిగా ఆడేదని, అందుకే టీం ఇండియా మొత్తం తన ఫేవరేట్ అని నమ్రతా వెల్లడించారు. ఈ సమ్మర్‌ను కుటుంబంతో గోవాలో ఎంజాయ్ చేస్తామని, జూలైలో గోవాకు ప్రయాణమవుతున్నామని నమ్రత తెలిపారు.
జూబ్లీహిల్స్‌లో కొత్తగా నెలకొల్పిన 'కెఫెమిలాంజ్'ను శుక్రవారం నమ్రతా ప్రారంభించారు. తన కుమారుడు గౌతమ్‌తో చాలాసేపు గడిపారు. గౌతమ్ గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పనని మాట దాటవేశారు.
అనంతరం కాఫీషాఫ్ అధినేత మాధవ్ మాట్లాడుతూ, సినిమా షూటింగ్‌లకు, వివిధ ఫంక్షన్‌లు చేసుకునేందుకు వీలుగా ఉంటుందనీ కాఫీషాప్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఐదుగురు స్నేహితులు కలిసి ఈ కెఫెమిలాంజ్‌ను స్థాపించామని మాధవ్ తెలిపారు.
0 comments:
Post a Comment