రాజస్థాన్‌లో "ఖలేజ"


'అతడు'... మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ల కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం. ఆ సినిమా అటు వినోదపరంగానూ, యాక్షన్‌ అంశాల విషయంలోనూ అన్ని వయసులవారినీ మెప్పించింది. ఆ కాంబినేషన్‌లోనే మరో చిత్రం రూపుదిద్దుకొంటోంది. మహేష్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో కనకరత్న మూవీస్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క నాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగింది. ఈ నెల 23 నుంచి రాజస్థాన్‌లో సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. నిర్మాత శింగనమల రమేష్‌బాబు మాట్లాడుతూ ''మహేష్‌ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు కలబోసిన చిత్రమిది. డిసెంబరు నాటికి చిత్ర నిర్మాణం పూర్తవుతుంద''న్నారు. సమర్పణ: ఎస్‌.సత్యరామమూర్తి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బి.బుల్లిసుబ్బారావు, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సునీల్‌ పటేల్‌.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates