‘‘నేను ఊహించినదానికన్నా ఈ చిత్రానికి ఎక్కువ స్పందన లభించింది. చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. నా అభిమానులు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు’’ అని మహేష్‌బాబు అంటున్నారు. ఆయన హీరోగా, అనుష్క హీరోయిన్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శింగనమల రమేష్, సి.కళ్యాణ్ కలిసి నిర్మించిన ‘మహేష్ ఖలేజా’ గత గురువారం విడుదలైన విషయం విదితమే. ఈ చిత్రం తాము ఊహించినట్లుగానే ప్రేక్షకాదరణ పొందిందని ఆదివారం ఏర్పాటు చేసిన ‘సక్సెస్ మీట్’లో మహేష్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న సి.కళ్యాణ్ మాట్లాడుతూ - ‘‘పది సినిమాలకు చేసే నటనను మహేష్‌బాబు ఈ ఒక్క సినిమాకే చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా యూఎస్‌లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చేయనంత చేస్తోంది ‘ఖలేజా’’’ అన్నారు.
‘‘మహేష్, నా కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’కి పూర్తి భిన్నంగా ఈ చిత్రంలోని పాత్ర ఉండాలనుకున్నాను. ‘అతడు’లో...