మహేష్‌బాబు తెలుగు తెరపై కనిపించి మూడేళ్లయింది. తమ అభిమాన కథానాయకుని సినిమా ఎప్పుడు చూస్తామా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 'ఖలేజా' చూపించడానికి మహేష్ సిద్ధమయ్యారు. ఈ చిత్రం 7న విడుదలవుతోంది. దైవమ్ మానుష్య రూపేణా అనే సిద్ధాంతంతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మహేష్ బాబు ట్యాక్సీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మహేష్ సరసన అనుష్క నటించింది. శింగనమల రమేష్, సి.కల్యాణ్‌లు నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. నిర్మాతల్లో ఒకరైన సి.కల్యాణ్ మాట్లాడుతూ ''మహేష్, త్రివిక్రమ్‌ల కలయిక అనేసరికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటిని తప్పక అందుకొంటాం. ఇటీవలే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంద''న్నారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, అలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, షపీ, సునీల్ శర్మ, సుధ, శ్రీరంజని తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: ఎస్.భట్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, కళ: ఆనంద్‌సాయి, సమర్పణ: ఎస్.సత్యరామ్మూర్తి.
0 comments:
Post a Comment