ముంబయిలో 'దూకుడు'

హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 'దూకుడు' చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో సాగుతోంది. మహేష్‌బాబుపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజు సుందరం నృత్యరీతులు సమకూరుస్తున్నారు. పదిరోజులపాటు అక్కడే ఈ గీతంతోపాటు కొన్ని పోరాట సన్నివేశాల్ని చిత్రిస్తారు. కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని మే 31న 'దూకుడు' పాటలను విడుదల చేసే అవకాశాలున్నాయి. మహేష్‌బాబు శైలిలోని వినోదం, యాక్షన్‌ అంశాలతో కూడుకొన్న కథ అనీ, ఆయన హావభావాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సంగీతం: తమన్‌.

పాతబస్తీలో 'దూకుడు'


హేష్‌బాబు సినిమా అంటే యాక్షన్‌, వినోదం... కలబోతగా ఉంటుంది. దర్శకుడు శ్రీను వైట్లదీ అదే శైలి. వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'దూకుడు'. సమంత కథానాయికగా నటిస్తోంది. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌ పాతబస్తీలో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ చేశారు. త్వరలోనే మరికొన్ని కీలక ఘట్టాలను ముంబయిలో చిత్రీకరిస్తారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మా దూకుడు సిద్ధమవుతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ నటన, ఆయన హావభావాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఇప్పటికే అరవైశాతంపైగా చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

రామోజీ ఫిల్మ్‌సిటీలో దూకుడు

హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. 

మహేష్‌బాబుపై పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 20 నుంచి ముంబయిలో కీలక ఘట్టాల్ని చిత్రిస్తారు. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తయింది. 

జూన్‌లో 'దూకుడు'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహేష్‌బాబు పాత్ర, నటన అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకొంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 

శ్రీను వైట్ల శైలి వినోదం, మాస్‌ అంశాలు మేళవించిన కథ అనీ, 'దూకుడు' అనే పేరుకు తగ్గట్టుగానే యాక్షన్‌ అంశాలుంటాయని తెలిసింది. సంగీతం: తమన్‌.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates