మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 'దూకుడు' చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో సాగుతోంది. మహేష్‌బాబుపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజు సుందరం నృత్యరీతులు సమకూరుస్తున్నారు. పదిరోజులపాటు అక్కడే ఈ గీతంతోపాటు కొన్ని పోరాట సన్నివేశాల్ని చిత్రిస్తారు. కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని మే 31న 'దూకుడు' పాటలను విడుదల చేసే అవకాశాలున్నాయి. మహేష్‌బాబు శైలిలోని వినోదం, యాక్షన్ అంశాలతో కూడుకొన్న కథ అనీ, ఆయన హావభావాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సంగీతం: తమన్.
0 comments:
Post a Comment