మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.
మహేష్‌బాబుపై పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 20 నుంచి ముంబయిలో కీలక ఘట్టాల్ని చిత్రిస్తారు. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తయింది.
జూన్‌లో 'దూకుడు'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహేష్‌బాబు పాత్ర, నటన అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకొంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
శ్రీను వైట్ల శైలి వినోదం, మాస్ అంశాలు మేళవించిన కథ అనీ, 'దూకుడు' అనే పేరుకు తగ్గట్టుగానే యాక్షన్ అంశాలుంటాయని తెలిసింది. సంగీతం: తమన్.
0 comments:
Post a Comment