మహేష్‌బాబు సినిమా అంటే యాక్షన్, వినోదం... కలబోతగా ఉంటుంది. దర్శకుడు శ్రీను వైట్లదీ అదే శైలి. వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'దూకుడు'. సమంత కథానాయికగా నటిస్తోంది. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీలో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ చేశారు. త్వరలోనే మరికొన్ని కీలక ఘట్టాలను ముంబయిలో చిత్రీకరిస్తారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మా దూకుడు సిద్ధమవుతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మహేష్ నటన, ఆయన హావభావాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఇప్పటికే అరవైశాతంపైగా చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.
0 comments:
Post a Comment