ఆరు నెలల క్రితం ‘బిజినెస్‌మేన్’ ఓపెనింగ్ రోజున ‘‘2012 జనవరి 11న
‘బిజినెస్‌మేన్’ని విడుదల చేస్తాం’’ అని ప్రకటించారు పూరీజగన్నాథ్.
అన్నమాటను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో... డిసెంబర్ 10 నాటికే షూటింగ్‌ని
పూర్తి చేశారాయన. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా పూరీ తెలియజేశారు.
‘‘మహేష్‌బాబు ఈ సినిమా కోసం 65 రోజులు పనిచేశారు. కాజల్ 30 రోజులు
షూటింగ్‌లో పాల్గొన్నారు. కేవలం 74 రోజుల్లో 84వేల అడుగుల ఎక్స్‌పోజర్‌తో
అనుకున్న ప్రకారం పర్‌ఫెక్ట్‌గా షూటింగ్‌ని పూర్తి చేయగలిగాం. ఇంత పెద్ద
సినిమాను రికార్డ్ టైమ్‌లో పూర్తి చేయగలిగానంటే దానికి కారణం యూనిట్ సభ్యుల
సపోర్టే.
‘పోకిరి’ తర్వాత నేను, మహేష్ కలిసి పనిచేస్తున్న సినిమా
కావడంతో సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందరి అంచనాలనూ అందుకునే
విధంగా సినిమా ఉంటుంది. ఇందులో మహేష్ పాత్ర పేరు ‘సూర్య’. హీరోయిజాన్ని
పీక్ లెవల్‌కి తీసుకెళ్లే విధంగా ఆయన పాత్ర చిత్రణ ఉంటుంది. అలాగే మహేష్,
కాజల్‌పై చిత్రీకరించిన పాటలు కూడా కలర్‌ఫుల్‌గా వచ్చాయి. ఇప్పటివరకూ
విడుదల చేసిన రెండు టీజర్స్‌కీ అద్భుతమైన స్పందన వస్తోంది. తమన్ ఈ సినిమాకు
వినసొంపైన బాణీలను అందించారు.
డిసెంబర్ 22న తెలుగు, తమిళ, మలయాళ
భాషల్లో ‘బిజినెస్‌మేన్’ పాటలను విడుదల చేయనున్నాం. ప్రస్తుతం పోస్ట్
ప్రొడక్షన్ జరుగుతోంది. జనవరి 11న సినిమా విడుదల చేస్తాం’’ అని
పూరీజగన్నాథ్ చెప్పారు. ప్రకాష్‌రాజ్, సయాజీషిండే, నాజర్, ధర్మవరపు
సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్‌రెడ్డి, రాజా మురాద్, జహంగీర్
ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ
చిత్రానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్:
ఎస్.ఆర్.శేఖర్, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: వెంకట్,
నిర్మాణం: ఆర్.ఆర్.మూవీ మేకర్స్.
0 comments:
Post a Comment