మహేష్ కథానాయకుడిగా ఆర్. ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘బిజినెస్‌మెన్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం కోసం బ్యాంకాక్, పటాయ, క్రాబిలలో రెండు పాటల్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ ఈ నెల 2 నుంచి 10 వరకు జరిగే ప్యాచ్‌వర్క్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం తొలి భాగం రీ-రికార్డింగ్ ప్రారంభమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరుకు తొలికాపీ సిద్ధం చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఈ నెల 22న తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్‌లకు సంబంధించిన ఆడియోని విడుదల చేయబోతున్నాం. జనవరి 11న అత్యధిక థియేటర్లలో ‘బిజినెస్‌మెన్’ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మహేష్, పూరి జగన్నాథ్ ఈ చిత్రంలోని థీమ్ సాంగ్‌ను పాడటం విశేషం. ‘పోకిరి’లో పూరి జగన్నాథ్ డైలాగ్స్ ఎలా ప్రాచుర్యం పొందాయో అంతకు రెట్టింపు స్థాయిలో ‘బిజినెస్‌మెన్’లోని డైలాగ్స్ పాపులర్ అవుతాయి. మహేష్ కెరీర్‌లో ‘బిజినెస్‌మెన్’ మరో పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతోంది’ అన్నారు. కాజల్ పకాష్‌రాజ్, షాయాజీ షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్.ఎస్, సినిమాటోగ్రఫీ: శ్యామ్.కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్
0 comments:
Post a Comment