మహేష్‌బాబుతో తాజాగా ‘దూకుడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు రామ్‌అచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తదుపరి చిత్రాన్ని కూడా మహేష్‌బాబు కథానాయకుడిగా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభకానున్నట్లు సమాచారం. దిల్‌రాజ్ నిర్మిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో కూడా మహేష్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
0 comments:
Post a Comment