Mahesh About Business Man Success

ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాలో లేదు:మహేష్ బాబు
 

‘నెంబర్‌గేమ్స్‌ను నేను పట్టించుకోను. నా పని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాకు లేదు’ అంటున్నాడు యువ కథానాయకుడు మహేష్‌బాబు. సీనియర్ నటుడు కృష్ణ నట వారసుడిగా రంగవూపవేశం చేసిన మహేష్ అనతి కాలంలోనే తెలుగు సినీ పరిక్షిశమలో క్రేజీ కథానాయకుడిగా ఎదిగాడు. ‘పోకిరి’తో 75 ఏళ్ళ సినీ చరివూతను తిరగరాసిన ఈ ప్రిన్స్.. ‘దూకుడు’తో ఆ రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు తాజాగా ‘బిజినెస్8మేన్’ చిత్రంతో మరో సంచలనాత్మక విజయాన్ని తన ఖాతాలో జమచేసుకొని హీరోగా తిరుగులేని స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘బిజినెస్8మేన్’ చిత్రం గురించి మహేష్‌బాబు చెప్పిన విశేషాలు..
‘బిజినెస్ మేన్’కు వస్తున్న స్పందన ఎలా వుంది?
నా కెరీర్‌లో మరో అతిపెద్ద విజయంగా ‘బిజినెస్8మేన్’ నమోదు అయినందుకు ఆనందంగా వుంది. ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఎంతో సంతోషంగా వుంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వారిలో కనిపిస్తుంది.

‘బిజినెస్8మేన్’ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చెయ్యబోతుందని అనుకుంటున్నారు?
రికార్డుల గురించి, సంచలనాల గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం సరికాదు. కానీ ఇప్పటి వరకు తెలుగు సినిమా చరివూతలో ఏ సినిమా ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదు. ఇప్పటికీ టిక్కెట్లు దొరకడం లేదని, టిక్కెట్లు ఆబ్లిగేషన్స్‌తో మాత్రమే దొరుకుతున్నాయని అందరూ అంటూంటే ఆనందంగా వుంది.
‘దూకుడు’లాంటి ఘనవిజయం తర్వాత వెంటనే ‘బిజినెస్8మేన్’ రూపంలో మరో విజయాన్ని అందుకోవడం ఎలా వుంది?

‘దూకుడు’ విడుదలైన రోజు నుంచి అంటే సెప్టెంబర్ 23 నుంచి ఈ రోజు వరకు అంతా కలగానే వుంది.
‘దూకుడు’లో యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ పాత్రను చేసిన మీరు ఈ చిత్రంలో పూర్తి స్థాయి మాస్8 పాత్రలో టిపికల్‌గా కనిపించారు?
ఖచ్చితంగా ‘సూర్య’ భాయ్ చాలా టిపికల్ క్యారెక్టర్. ఛాలెంజింగ్‌గా అనిపించే పాత్ర అది. అయితే ఇలాంటి పాత్రలో నటించి ఆడియన్స్‌ను ఒప్పించడం చాలా కష్టం. ఒక వేళ ఆ పాత్ర ప్రేక్షకులను కన్వీన్స్ చేయకపోతే రిజల్ట్‌లో తేడా వచ్చేది. సాధారణంగా పూరిజగన్నాథ్ చిత్రాల్లో కథానాయకుల పాత్రలు చాలా టిపికల్‌గా వుంటాయి. బిజినెస్ మేన్‌లో ఆయన నా పాత్ర గురించి చెప్పగానే ఎంతో నచ్చింది. నాకు తెలిసి పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో సూర్య భాయ్ ది బెస్ట్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో అన్నింటి కంటే కష్టమైన పాత్ర కూడా ఇదే.

‘బిజినెస్8మేన్’లో కొన్ని సంభాషణల్లో బూతులు జత చేశారు? దీని పట్ల మీ స్పందన?
మొదట్నుంచీ కూడా ‘బిజినెస్8మేన్’ చిత్రం ఓ గ్యాంగ్‌స్టర్ సినిమా అని చెబుతూ వచ్చాం. ఏ రోజు కూడా మేము ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీస్తున్నామని చెప్పలేదు. ఓ మాఫియా పాత్ర ఎలా వుండాలో, ఎలా మాట్లాడాలో దానికి తగ్గట్టుగా పూరి జగన్నాథ్ ఆ పాత్రను తీర్చిదిద్దాడు. చిన్న చిన్న విషయాల గురించి స్క్రిప్ట్ చెడిపోకూడదనే ఉద్దేశంతోనే అటువంటి సంభాషణలు పెట్టాల్సి వచ్చింది.
‘పోకిరి’ నుంచి ‘దూకుడు’ మధ్యలో మిమ్మల్ని కొన్ని అపజయాలు పలకరించాయి కదా..ఆ సమయంలో మీ ఆలోచనా విధానం ఎలా వుండేది?

ఇప్పటి వరకు నేను ఏదీ అనుకోని ప్లాన్ చేయలేదు. ఇక ‘పోకిరి’ లాంటి సంచలనాత్మకమైన విజయం తర్వాత నాలో కొంత కన్‌ఫ్యూజన్ మొదలైంది. ‘పోకిరి’ లాంటి పవర్‌ఫుల్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాలేదు. ఇక ఈ సమయంలోనే నన్ను ఎంతో అనురాగంతో చూసుకునే మా అమ్మమ్మ చనిపోవడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాను. ఈ సమయంలో సినీ పరిక్షిశమకు దూరంగా వున్నాను. ఎవ్వరితోనూ మాట్లాడలేదు. ఆ తర్వాత అతిథి, ఖలేజా చిత్రాలను చేశాను. అందులో ఖలేజా కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోయినా ఆ చిత్రం నటుడిగా నాకెంతో సంతృప్తినిచ్చింది.
సినిమాలో సింహభాగం మీరే కనిపించారు? మీ పాత్రే ఎక్కువగా మాట్లాడుతుంది? ఎందుకని?
జగన్ కథ చెప్పినప్పుడే నాకు ఈ విషయం తెలుసు. సినిమాలో సూర్య భాయ్ పాత్రే ఎక్కువగా మాట్లాడుతుంది. అయితే దానికి నా మీద జగన్‌గారికి వున్న నమ్మకమే ప్రధాన కారణం.
చిరంజీవి తర్వాత తెలుగు సినీ పరిక్షిశమలో నెంబర్‌వన్ స్థానం మీదేనని అందరూ అంటున్నారు? ఆయన స్థానాన్ని మీరు భర్తీ చేయాలనే ఆలోచన ఏమైనా వుందా?

నెంబర్‌గేమ్స్‌పై నాకు నమ్మకం లేదు. ఇక ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాలో అంతకన్నా లేదు. నా పని నేను చేసుకుంటూ నటుడిగా నన్ను నేను మెరుగుపరుచుకోవడమే నాకు తెలుసు.
మీ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు మీ మానసిక స్థితి ఎలా వుంటుంది?
నా సినిమా ఆడకపోతే చాలా అప్‌సెట్ అవుతాను. ఇంట్లోనే వుంటాను.. బయటికి కూడా రాను. ఎవరితోనూ మాట్లాడను. సాధారణంగా అందరూ సక్సెస్, ఫెయిల్యూర్స్ ఒకేలా స్వీకరిస్తాం అంటుంటారు కాని అది తప్పు. సినిమా ఆడకపోతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. అప్పుడు మనమేలా సంతోషంగా వుంటాం!
‘బిజినెస్ మేన్’లో మీరు హీరో కాకపోయింటే సూర్య భాయ్ పాత్ర ఏ హీరోకు సరిపోయేదని మీ నమ్మకం?
బిజినెస్8మేన్ నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఎందుకంటే నేను నమ్మినంతగా జగన్‌ను వేరెవ్వరూ నమ్మరు. ఎందుకంటే నేను జగన్‌ను నమ్మి, స్క్రిప్ట్‌ను నమ్మి ఆయన చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్ళాను.
మీ సక్సెస్8 వెనుక మీ శ్రీమతి నమ్రతా ప్రోత్సాహం ఎంతవరకు వుంటుంది?
ఇంట్లో వాతావరణం కూల్‌గా వుంటేనే మనసు ప్రశాంతంగా వుంటుంది. అప్పుడే మనకు సక్సెస్8లు కూడా వస్తుంటాయి. సో.. నేను ప్రశాంతంగా వున్నాను.
‘బిజినెస్ మేన్-2’ చేస్తున్నామని పూరి అనౌన్స్ చేశారు?
తప్పకుండా పూరి, నా కలయికలో ఆ చిత్రం వుంటుంది. ‘బిజినెస్8 మేన్ 2’ చేద్దాం అని పూరి చెప్పగానే ఎంతో ఎక్జ్సయిటింగ్‌గా అనిపించింది.
మీ తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నాను. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates