మహేష్‌బాబు కథానాయకుడిగా నటించే కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని 14రీల్స్ సంస్థ నిర్మించబోతోంది. ఈ నెల 12న లాంఛనంగా హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. ఇందులో మహేష్ సరసన తమన్నా కథానాయికగా నటించే అవకాశాలున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తారు. 'దూకుడు', 'బిజినెస్‌మేన్' విజయాలతో ఖుషీగా ఉన్న మహేష్ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇటీవలే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. అలాగే క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని అంగీకరించారు.
0 comments:
Post a Comment