Aagadu Mahesh Role: Encounter Specialist

Mahesh Babu, Encounter Specialist, Aagadu, Sreenu Vaitla, శ్రీనువైట్ల, ఆగడు, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌, మహేష్ బాబు మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆగడు’. తమన్నా కథానాయిక. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజాకార్యక్షికమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా శంకర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసింది. దూకుడు’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి తెలంగాణ యాసలో డైలాగ్‌లు చెప్పిన మహేష్ ఈ సినిమాలో రాయలసీమ స్లాంగ్‌ని అనుకరిస్తాడని చిత్ర వర్గాల సమాచారం.మాస్ అంశాలుంటూనే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 2 నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. అత్యుత్తమ నిర్మాణ విలువలతో తెరకెక్కనున్న చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్‌లో ఏప్రిల్‌లోగా పూర్తి...

Mahesh 1 Climax Shooting In Goa

2013, 2014, Mahesh Babu, Shooting, Sukumar, Prince, Prince Mahesh, Super star Mahesh 'దూకుడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు'... ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మహేష్‌బాబు. రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో, మరో రెండు కథాచర్చల్లో ఉన్నాయి. అందులో '1' (నేనొక్కడినే) ప్రస్తుతం గోవా తీరంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ కథానాయిక. సుకుమార్‌ దర్శకుడు. గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది...

Mahesh new movie Vijyanthi Banner

Mahesh babu, bollywood, Raj Nidimoru, Krishna D.K, Aswini Dutt, అశ్వనీదత్, మహేష్ బాబు, రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె, బాలీవుడ్, Prince, Prince Mahesh, Superstar, Superstar Mahesh మహేష్‌బాబు కథానాయకుడిగా వైజయంతి మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కృష్ణ నిడిమోరు, రాజ్‌ డి.కె. దర్శకత్వం వహిస్తారు. సి.అశ్వనీదత్‌ నిర్మాత. ''మహేష్‌తో ఇది మా మూడో చిత్రం. 2014 ప్రధమార్ధంలో సినిమాని ప్రారంభిస్తాం. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం. మహేష్‌బాబు శైలి, ఇమేజ్‌కి తగిన కథ సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతామ''న్నారు అశ్వనీదత్‌. ప్రస్తుతం '1' (నేనొక్కడినే) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మహేష్‌. ఇటీవలే 'ఆగడు' కూడా మొదలైంది. డిసెంబరులో '1' చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తరవాత వైజయంతి మూవీస్‌ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నా...

Pages 311234 »

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates