మహేష్‌తో అనుష్క ‘వేట’

ఇటీవల విడుదలైన ‘మహేష్ ఖలేజా’ చిత్రాన్ని చూశారా... ఆ చిత్రంలో జంటగా నటించిన అల్లూరి సీతారామరాజు, సుభాషిణిల జంట ఎలా వుంది..! వారిద్దరి మధ్య నడిచిన సన్నివేశాలు మిమ్ములను నాన్‌స్టాప్‌గా నవ్వించాయి కదూ..? ఆ చిత్రంలో సీతారామరాజు, సుభాషిణిలుగా నటించిన మహేష్‌బాబు, అనుష్క జంట త్వరలో మరో చిత్రంలో కూడా కలిసి నటించనున్నారని సమాచారమ్.

ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘దూకుడు’ చిత్రంలో నటిస్తున్న మహేష్ త్వరలో లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ‘వేట’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో అనుష్క కథానాయికగా ఎంపికయ్యారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయకుడు మాధవన్‌తో పాటు నాయిక సమీరారెడ్డి కూడా కీలక పాత్రలను పోషించనున్నారట.

ఇంకో విషయం ఏమంటే- ఈ చిత్రంలో తెలుగులో మహేష్ చేస్తున్న పాత్రను తమిళంలో ఆర్య చేస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మహేష్‌తో వెంటనే మరో చిత్రం చేసే అవకాశం రావటం పట్ల స్వీటీ (అనుష్క ముద్దుపేరు) ఆనందంగా వున్నారని సమాచారమ్.

దుబాయ్‌లో దూకుడు


 
'ఖలేజా'లో సరికొత్త హావభావాలతో అభిమానుల్ని ఆకట్టుకొన్నారు మహేష్‌బాబు. ఆయన మాట తీరులో, నటనలో ఇంతకు ముందు లేని 'దూకుడు' కనిపించింది. ఇప్పుడు ఆయన కొత్త సినిమా పేరు కూడా అదే. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ కొన్ని పాటల్ని తెరకెక్కిస్తారు. ఇది వరకు టర్కీలో కొంత భాగం చిత్రీకరించారు. వినోదం, యాక్షన్‌ తగుపాళ్లలో మేళవించిన కథ ఇదని, ఇందులో మహేష్‌ మరింత కొత్తగా కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంగీతం: తమన్‌.|

తెలుగులో 'త్రీ ఇడియట్స్‌'

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన చిత్రం 'త్రీ ఇడియట్స్‌'. శంకర్‌ ఈ కథని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 'రోబో' తరవాత శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఆయన ఓ రీమేక్‌ కథను ఎంచుకోవడం కూడా ఇదే తొలిసారి. తెలుగులో మహేష్‌బాబు, తమిళంలో విజయ్‌ కథానాయకులు. రెండు భాషల్లోనూ ఇలియానా నాయికగా నటించబోతోంది. ఇటీవలే ఆమెతో శంకర్‌ చర్చించారు. డిసెంబరు 26 నుంచి చిత్రీకరణ మొదలవుతుందని చెన్నై సమాచారం. మాధవన్‌, శర్మాన్‌ జోషి పాత్రల్ని తమిళ నటులు ఆర్య, జీవా పోషిస్తారు. ప్రిన్సిపాల్‌గా సత్యరాజ్‌ నటిస్తారు. కథకు మూలం 'త్రీ ఇడియట్స్‌' సినిమానే అయినప్పటికీ దక్షిణాది ప్రేక్షకుల అభిరుచులు, కథానాయకుల శైలిని బట్టి కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. హారిస్‌ జైరాజ్‌ స్వరాలు, మనోజ్‌ పరమహంస ఛాయాగ్రహణం అందిస్తారు.

టర్కీలో మహేష్‌ 'దూకుడు'


హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. తమన్‌.ఎస్‌ సంగీతం సమకూరుస్తున్నారు. నీ దూకుడు సాటెవ్వడు... అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం టర్కీలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రేమ, వినోదం, యాక్షన్‌ మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెరపై మహేష్‌ కొత్త తరహా హావభావాలతో వినోదాన్ని పండిస్తారని దర్శకుడు అంటున్నారు. టర్కీలో మహేష్‌, సమంతలపై ఒక పాటతో పాటు, కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. త్వరలో గుజరాత్‌, దుబాయ్‌లో చిత్రీకరణ జరుపనున్నట్టు సమాచారం. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. సమర్పణ: కృష్ణా ప్రొడక్షన్స్‌ ప్రై.లి.

మణిరత్నం దర్శకత్వం లో మహేష్, విక్రమ్..!


 ఖలేజా కుర్రాడు మహేష్‌..సంచలన దర్శకుడు మణిరత్నం రూపకల్పనలోని చిత్రంలో నటించనున్నాడా? అంటే..అవుననే వినిపిస్తోంది ఫిలింనగర్‌లో! ఈ చిత్రాన్ని ‘రోబో’ నిర్మాత కళానిధి మారన్‌ సన్‌పిక్చర్స్‌ పతాకంపై నిర్మించనున్నారని తెలుస్తోంది. తెలుగు, తమిళ్‌ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరెక్కే ఈ చిత్రంలో హీరో విక్రమ్‌ కూడా మరో కీలక పాత్రలో నటించనున్నాడు. ఇటీవల ‘విలన్‌’ను అభిషేక్‌, విక్రమ్‌లతో రూపొందించిన మణి..ఈ చిత్రాన్ని కూడా ప్రయో గాత్మకంగా తనదైన శైలిలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చారిత్రక కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో మహేష్‌ పల్లవ రాజుగా చోళరాజు (రాజరాజు)గా దర్శనమిస్తారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఏదేమైనా..నాగార్జున, అరవింద్‌ స్వామిలతో అద్భుత దృశ్యకావ్యాలను ఆవిష్కరించిన మణి ఈసారి మహేష్‌తో ఇంకెలాంటి వండర్‌ను ఆవిష్కరిస్తారో అనే ఉత్సుకత అభిమానుల్లో ఉంది.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates