skip to main |
skip to sidebar
మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. తమన్.ఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. నీ దూకుడు సాటెవ్వడు... అంటూ సాగే టైటిల్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం టర్కీలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రేమ, వినోదం, యాక్షన్ మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెరపై మహేష్ కొత్త తరహా హావభావాలతో వినోదాన్ని పండిస్తారని దర్శకుడు అంటున్నారు. టర్కీలో మహేష్, సమంతలపై ఒక పాటతో పాటు, కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. త్వరలో గుజరాత్, దుబాయ్‌లో చిత్రీకరణ జరుపనున్నట్టు సమాచారం. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. సమర్పణ: కృష్ణా ప్రొడక్షన్స్ ప్రై.లి.
0 comments:
Post a Comment