ఖలేజా కుర్రాడు మహేష్..సంచలన దర్శకుడు మణిరత్నం రూపకల్పనలోని చిత్రంలో నటించనున్నాడా? అంటే..అవుననే వినిపిస్తోంది ఫిలింనగర్‌లో! ఈ చిత్రాన్ని ‘రోబో’ నిర్మాత కళానిధి మారన్ సన్‌పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నారని తెలుస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరెక్కే ఈ చిత్రంలో హీరో విక్రమ్ కూడా మరో కీలక పాత్రలో నటించనున్నాడు. ఇటీవల ‘విలన్’ను అభిషేక్, విక్రమ్‌లతో రూపొందించిన మణి..ఈ చిత్రాన్ని కూడా ప్రయో గాత్మకంగా తనదైన శైలిలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చారిత్రక కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో మహేష్ పల్లవ రాజుగా చోళరాజు (రాజరాజు)గా దర్శనమిస్తారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఏదేమైనా..నాగార్జున, అరవింద్ స్వామిలతో అద్భుత దృశ్యకావ్యాలను ఆవిష్కరించిన మణి ఈసారి మహేష్‌తో ఇంకెలాంటి వండర్‌ను ఆవిష్కరిస్తారో అనే ఉత్సుకత అభిమానుల్లో ఉంది.
0 comments:
Post a Comment