తెలుగులో 'త్రీ ఇడియట్స్‌'

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన చిత్రం 'త్రీ ఇడియట్స్‌'. శంకర్‌ ఈ కథని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 'రోబో' తరవాత శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఆయన ఓ రీమేక్‌ కథను ఎంచుకోవడం కూడా ఇదే తొలిసారి. తెలుగులో మహేష్‌బాబు, తమిళంలో విజయ్‌ కథానాయకులు. రెండు భాషల్లోనూ ఇలియానా నాయికగా నటించబోతోంది. ఇటీవలే ఆమెతో శంకర్‌ చర్చించారు. డిసెంబరు 26 నుంచి చిత్రీకరణ మొదలవుతుందని చెన్నై సమాచారం. మాధవన్‌, శర్మాన్‌ జోషి పాత్రల్ని తమిళ నటులు ఆర్య, జీవా పోషిస్తారు. ప్రిన్సిపాల్‌గా సత్యరాజ్‌ నటిస్తారు. కథకు మూలం 'త్రీ ఇడియట్స్‌' సినిమానే అయినప్పటికీ దక్షిణాది ప్రేక్షకుల అభిరుచులు, కథానాయకుల శైలిని బట్టి కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. హారిస్‌ జైరాజ్‌ స్వరాలు, మనోజ్‌ పరమహంస ఛాయాగ్రహణం అందిస్తారు.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates