'ఖలేజా'లో సరికొత్త హావభావాలతో అభిమానుల్ని ఆకట్టుకొన్నారు మహేష్‌బాబు. ఆయన మాట తీరులో, నటనలో ఇంతకు ముందు లేని 'దూకుడు' కనిపించింది. ఇప్పుడు ఆయన కొత్త సినిమా పేరు కూడా అదే. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ కొన్ని పాటల్ని తెరకెక్కిస్తారు. ఇది వరకు టర్కీలో కొంత భాగం చిత్రీకరించారు. వినోదం, యాక్షన్ తగుపాళ్లలో మేళవించిన కథ ఇదని, ఇందులో మహేష్ మరింత కొత్తగా కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంగీతం: తమన్.|
0 comments:
Post a Comment