Tamanna Out From Mahesh Sukumar Movie

దూకుడు, బిజినెస్‌మేన్ చిత్రాల వేడి పూర్తిగా చల్లారనేలేదు. అప్పుడే మరో సంచలనానికి తెరతీశారు మహేష్‌బాబు. ఓ వైపు వెంకటేష్‌తో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’లో నటిస్తూ... మరో వైపు సుకుమార్ చిత్రానికి కూడా రంగం సిద్ధం చేసేశారు. మహేష్‌తో ‘దూకుడు’ లాంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట త్రయం నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది.

దిల్‌రాజు, ఎస్.ఎస్.రాజమౌళి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో మహేష్ సరసన ఓ కొత్త అమ్మాయిని నటింపజేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం రత్నవేలు. సుకుమార్‌తో ఆర్య, ఆర్య2 చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన రత్నవేలు... రజనీకాంత్ ‘రోబో’తో సంచలన ఛాయాగ్రహకునిగా మారారు.

సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు... ఈ ముగ్గురూ మహేష్‌తో పనిచేయడం ఇదే ప్రధమం. మహేష్ ఇమేజ్‌ని రెట్టింపు చేసే విధంగా అద్భుతమైన కథతో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిసింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

Thamanna With Mahesh

హేష్‌బాబు కథానాయకుడిగా నటించే కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని 14రీల్స్‌ సంస్థ నిర్మించబోతోంది. ఈ నెల 12న లాంఛనంగా హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. ఇందులో మహేష్‌ సరసన తమన్నా కథానాయికగా నటించే అవకాశాలున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తారు. 'దూకుడు', 'బిజినెస్‌మేన్‌' విజయాలతో ఖుషీగా ఉన్న మహేష్‌ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇటీవలే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా సెట్స్‌ మీదకు వెళ్లింది. అలాగే క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని అంగీకరించారు.

Mahesh About Business Man Success

ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాలో లేదు:మహేష్ బాబు
 
‘నెంబర్‌గేమ్స్‌ను నేను పట్టించుకోను. నా పని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాకు లేదు’ అంటున్నాడు యువ కథానాయకుడు మహేష్‌బాబు. సీనియర్ నటుడు కృష్ణ నట వారసుడిగా రంగవూపవేశం చేసిన మహేష్ అనతి కాలంలోనే తెలుగు సినీ పరిక్షిశమలో క్రేజీ కథానాయకుడిగా ఎదిగాడు. ‘పోకిరి’తో 75 ఏళ్ళ సినీ చరివూతను తిరగరాసిన ఈ ప్రిన్స్.. ‘దూకుడు’తో ఆ రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు తాజాగా ‘బిజినెస్8మేన్’ చిత్రంతో మరో సంచలనాత్మక విజయాన్ని తన ఖాతాలో జమచేసుకొని హీరోగా తిరుగులేని స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘బిజినెస్8మేన్’ చిత్రం గురించి మహేష్‌బాబు చెప్పిన విశేషాలు..
‘బిజినెస్ మేన్’కు వస్తున్న స్పందన ఎలా వుంది?
నా కెరీర్‌లో మరో అతిపెద్ద విజయంగా ‘బిజినెస్8మేన్’ నమోదు అయినందుకు ఆనందంగా వుంది. ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఎంతో సంతోషంగా వుంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వారిలో కనిపిస్తుంది.

‘బిజినెస్8మేన్’ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చెయ్యబోతుందని అనుకుంటున్నారు?
రికార్డుల గురించి, సంచలనాల గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం సరికాదు. కానీ ఇప్పటి వరకు తెలుగు సినిమా చరివూతలో ఏ సినిమా ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదు. ఇప్పటికీ టిక్కెట్లు దొరకడం లేదని, టిక్కెట్లు ఆబ్లిగేషన్స్‌తో మాత్రమే దొరుకుతున్నాయని అందరూ అంటూంటే ఆనందంగా వుంది.
‘దూకుడు’లాంటి ఘనవిజయం తర్వాత వెంటనే ‘బిజినెస్8మేన్’ రూపంలో మరో విజయాన్ని అందుకోవడం ఎలా వుంది?

‘దూకుడు’ విడుదలైన రోజు నుంచి అంటే సెప్టెంబర్ 23 నుంచి ఈ రోజు వరకు అంతా కలగానే వుంది.
‘దూకుడు’లో యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ పాత్రను చేసిన మీరు ఈ చిత్రంలో పూర్తి స్థాయి మాస్8 పాత్రలో టిపికల్‌గా కనిపించారు?
ఖచ్చితంగా ‘సూర్య’ భాయ్ చాలా టిపికల్ క్యారెక్టర్. ఛాలెంజింగ్‌గా అనిపించే పాత్ర అది. అయితే ఇలాంటి పాత్రలో నటించి ఆడియన్స్‌ను ఒప్పించడం చాలా కష్టం. ఒక వేళ ఆ పాత్ర ప్రేక్షకులను కన్వీన్స్ చేయకపోతే రిజల్ట్‌లో తేడా వచ్చేది. సాధారణంగా పూరిజగన్నాథ్ చిత్రాల్లో కథానాయకుల పాత్రలు చాలా టిపికల్‌గా వుంటాయి. బిజినెస్ మేన్‌లో ఆయన నా పాత్ర గురించి చెప్పగానే ఎంతో నచ్చింది. నాకు తెలిసి పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో సూర్య భాయ్ ది బెస్ట్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో అన్నింటి కంటే కష్టమైన పాత్ర కూడా ఇదే.

‘బిజినెస్8మేన్’లో కొన్ని సంభాషణల్లో బూతులు జత చేశారు? దీని పట్ల మీ స్పందన?
మొదట్నుంచీ కూడా ‘బిజినెస్8మేన్’ చిత్రం ఓ గ్యాంగ్‌స్టర్ సినిమా అని చెబుతూ వచ్చాం. ఏ రోజు కూడా మేము ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీస్తున్నామని చెప్పలేదు. ఓ మాఫియా పాత్ర ఎలా వుండాలో, ఎలా మాట్లాడాలో దానికి తగ్గట్టుగా పూరి జగన్నాథ్ ఆ పాత్రను తీర్చిదిద్దాడు. చిన్న చిన్న విషయాల గురించి స్క్రిప్ట్ చెడిపోకూడదనే ఉద్దేశంతోనే అటువంటి సంభాషణలు పెట్టాల్సి వచ్చింది.
‘పోకిరి’ నుంచి ‘దూకుడు’ మధ్యలో మిమ్మల్ని కొన్ని అపజయాలు పలకరించాయి కదా..ఆ సమయంలో మీ ఆలోచనా విధానం ఎలా వుండేది?

ఇప్పటి వరకు నేను ఏదీ అనుకోని ప్లాన్ చేయలేదు. ఇక ‘పోకిరి’ లాంటి సంచలనాత్మకమైన విజయం తర్వాత నాలో కొంత కన్‌ఫ్యూజన్ మొదలైంది. ‘పోకిరి’ లాంటి పవర్‌ఫుల్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాలేదు. ఇక ఈ సమయంలోనే నన్ను ఎంతో అనురాగంతో చూసుకునే మా అమ్మమ్మ చనిపోవడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాను. ఈ సమయంలో సినీ పరిక్షిశమకు దూరంగా వున్నాను. ఎవ్వరితోనూ మాట్లాడలేదు. ఆ తర్వాత అతిథి, ఖలేజా చిత్రాలను చేశాను. అందులో ఖలేజా కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోయినా ఆ చిత్రం నటుడిగా నాకెంతో సంతృప్తినిచ్చింది.
సినిమాలో సింహభాగం మీరే కనిపించారు? మీ పాత్రే ఎక్కువగా మాట్లాడుతుంది? ఎందుకని?
జగన్ కథ చెప్పినప్పుడే నాకు ఈ విషయం తెలుసు. సినిమాలో సూర్య భాయ్ పాత్రే ఎక్కువగా మాట్లాడుతుంది. అయితే దానికి నా మీద జగన్‌గారికి వున్న నమ్మకమే ప్రధాన కారణం.
చిరంజీవి తర్వాత తెలుగు సినీ పరిక్షిశమలో నెంబర్‌వన్ స్థానం మీదేనని అందరూ అంటున్నారు? ఆయన స్థానాన్ని మీరు భర్తీ చేయాలనే ఆలోచన ఏమైనా వుందా?

నెంబర్‌గేమ్స్‌పై నాకు నమ్మకం లేదు. ఇక ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాలో అంతకన్నా లేదు. నా పని నేను చేసుకుంటూ నటుడిగా నన్ను నేను మెరుగుపరుచుకోవడమే నాకు తెలుసు.
మీ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు మీ మానసిక స్థితి ఎలా వుంటుంది?
నా సినిమా ఆడకపోతే చాలా అప్‌సెట్ అవుతాను. ఇంట్లోనే వుంటాను.. బయటికి కూడా రాను. ఎవరితోనూ మాట్లాడను. సాధారణంగా అందరూ సక్సెస్, ఫెయిల్యూర్స్ ఒకేలా స్వీకరిస్తాం అంటుంటారు కాని అది తప్పు. సినిమా ఆడకపోతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. అప్పుడు మనమేలా సంతోషంగా వుంటాం!
‘బిజినెస్ మేన్’లో మీరు హీరో కాకపోయింటే సూర్య భాయ్ పాత్ర ఏ హీరోకు సరిపోయేదని మీ నమ్మకం?
బిజినెస్8మేన్ నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఎందుకంటే నేను నమ్మినంతగా జగన్‌ను వేరెవ్వరూ నమ్మరు. ఎందుకంటే నేను జగన్‌ను నమ్మి, స్క్రిప్ట్‌ను నమ్మి ఆయన చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్ళాను.
మీ సక్సెస్8 వెనుక మీ శ్రీమతి నమ్రతా ప్రోత్సాహం ఎంతవరకు వుంటుంది?
ఇంట్లో వాతావరణం కూల్‌గా వుంటేనే మనసు ప్రశాంతంగా వుంటుంది. అప్పుడే మనకు సక్సెస్8లు కూడా వస్తుంటాయి. సో.. నేను ప్రశాంతంగా వున్నాను.
‘బిజినెస్ మేన్-2’ చేస్తున్నామని పూరి అనౌన్స్ చేశారు?
తప్పకుండా పూరి, నా కలయికలో ఆ చిత్రం వుంటుంది. ‘బిజినెస్8 మేన్ 2’ చేద్దాం అని పూరి చెప్పగానే ఎంతో ఎక్జ్సయిటింగ్‌గా అనిపించింది.
మీ తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నాను. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది.

Puri about BusinessMan

నా వ్యక్తిత్వమే మహేష్ పాత్రలో ప్రతిబింబించింది:పూరి
 
‘గుర్తుపెట్టుకో, నీకు నువ్వే తోపు...నీకు నచ్చింది చేసెయ్...ఎవరి మాటా వినకు...మనిషి మాట అసలే వినకు...నీ టార్గెట్ పది మైళ్లయితే పదకొండో మైలును లక్ష్యంగా చేసుకో...కొడ్తే దిమ్మతిరగాలి’...బిజినెస్8మేన్ సినిమాలో మహేష్‌బాబు క్లైమాక్స్‌లో చెప్పే డైలాగ్‌లివి. ఈ సంభాషణలన్నీ జీవితంలో ఎదురైన స్వీయ అనుభవాల నుంచి పుట్టినవే అంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. మంగళవారం ‘బిజినెస్ మేన్’ సక్సెస్8మీట్‌లో ఆయన పాత్రికేయులతో మచ్చటించారు. ‘మనిషి మాట అసలే వినకు’ అని చెప్పారు... ఇంతకీ మనం ఎవరి మాట వినాలని మీ ఉద్దేశ్యం అని ప్రశ్నిస్తే...‘అవును గౌతమబుద్దుడు, జీసన్ ఏ మనిషి మాట విని కొత్త తత్వాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఉన్న సిద్దాంతాలను పక్కన పెట్టి కొత్త సిద్ధాంతాలను వెలుగులోకి తెస్తేనే మనం ప్రత్యేకతను చాటుకోగలం. పోటీ అనేది మన అభివృద్ధికి దోహదపడుతుంది’ అని నిర్మొహమాటంగా సమాధానమిచ్చారాయన. ఆయన పాత్రికేయులతో చెప్పిన మరిన్ని సంగతులివి...

బిజినెస్ అంతా మాదే...
‘పోకిరి’ తర్వాత మహేష్‌బాబు, నా కాంబినేషన్‌లో ‘బిజినెస్8మేన్’ సినిమా రావడం వల్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలన్నింటినీ నిజం చేస్తూ ఈ సినిమా ఫుల్ బిజినెస్8 చేస్తోంది. రాజమంవూడిలో ఎంతటి రెస్పాన్స్ వస్తుందో చికాగోలో కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మహేష్‌బాబు అభిమానులందరూ పండగ చేసుకుంటున్నారు. ఇటీవల వైజాగ్‌లో సినిమా చూస్తే కృష్ణగారి అభిమానులు మా అబ్బాయికి మంచి హిట్ ఇచ్చావని ప్రశంసించారు.

అందుకే డైలాగ్స్ నచ్చాయి...
సినిమాలో హీరో సమాజానికి వ్యతిరేకంగా వుంటాడు. అందుకే అతను చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మహేష్ చెప్పిన సంభాషణల్లో నా వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ముక్కుసూటి సంభాషణలు ఎలా రాశారని చాలా మంది అడుగుతున్నారు...దానికి సమాధానం ఒకటే...నేనే కాదు జీవితంలో మోసపోయిన వాడు ఎవడైనా సరే ఇలాంటి సంభాషణలు రాస్తాడు. సినిమాలో మహేష్ ముంబయ్‌ని ‘?చ్ఛ’ పోయించడానికి వచ్చానంటాడు. ఆ డైలాగ్‌లో ఆలోచిస్తే ఎంతో లోతు వుంది. ఏ రంగంలోనైనా సరే ఒకర్ని ‘?చ్ఛ’ పోయించాలనే కసి వున్నప్పుడు పోటీ తత్వం వస్తుంది. అప్పుడు అందరూ వ్యక్తిగతంగా డెవలప్ అవుతారు. అందరికీ స్వార్థం వుండాలి. ఈగో వుండాలి.నేను నమ్మే ఫిలాసఫీ అదే. ఆ కోణంలో నుంచే సంభాషణలు రాశాను..ఇవే అంశాల్ని మహేష్‌బాబు పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను.

అది మహేష్‌బాబుకే సాధ్యం...
ఇలాంటి స్క్రిప్ట్, డైలాగ్స్ వున్న సినిమాలో కొత్త హీరోలు ఎవరైనా నటిస్తే సినిమా ఇలా వుండేది కాదు. మహేష్‌బాబు స్టార్‌డమ్ ఈ కథకు బాగా ఉపయోగపడింది. ఇరవై రోజులు షూటింగ్ జరిగిన తర్వాత మహేష్‌బాబుకు కథ చెప్పాను. అయినా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పాత్రలో జీవించాడు. నేను అనుకున్న దానికి పదింతలు మహేష్ పాత్రకు న్యాయం చేశాడు. సీన్ పేపర్ చూడకుండానే భారీ డైలాగ్స్‌ని కూడా సింగిల్ చెప్పాడు. రెండున్నర గంటలు ఓ మనిషి డైలాగ్‌లు చెబుతుంటే ప్రేక్షకులు ఓపిగ్గా వింటున్నారంటే ఆ క్రెడిట్ మహేష్‌బాబుదే. సినిమాలో 99 శాతం సన్నివేశాల్ని మహేష్ సింగిల్ చేశాడు. అందుకే 72 రోజుల్లో సినిమాను పూర్తిచేయగలిగాం.

రికార్డ్స్ బ్రేక్ అవుతూనే వుండాలి...
పరిక్షిశమలో ఒకరి రికార్డులు ఒకరు బ్రేక్ చేసుకుం పరిక్షిశమకు మంచిది. అందరూ ఒకర్ని మించి ఒకరు మంచి హిట్ ఇవ్వాలనే తపనతో సినిమాలు తీయాలి. అలాంటి దృక్పథం పరిక్షిశమకు మేలు చేస్తుంది. వ్యక్తిగతంగా మనకు కూడా సంతృప్తి లభిస్తుంది.

మహేష్‌బాబుతో బిజినెస్ మేన్ 2
బిజినెస్ మేన్ సీక్వెల్‌గా మహేష్‌బాబుతో ‘బిజినెస్8మేన్ 2’ సీక్వెల్ వుంటుంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. అలాగే హిందీలో బిజినెస్8మేన్ చిత్రాన్ని రీమేక్ చేసే సన్నాహాల్లో వున్నాం. హీరో ఎవరనేది త్వరలో చెబుతాను. అలాగే ‘బిజినెస్8మేన్’ సినిమా స్క్రిప్ట్, డైలాగ్స్‌తో ఓ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాం. త్వరలో ఆ పుస్తకాన్ని విడుదల చేస్తాం. 1960లో ‘తోడి కోడళ్లు’ సినిమా స్క్రిప్ట్‌తో ఓ పుస్తకం వచ్చింది. అదే స్ఫూర్తితో బిజినెస్8మేన్ స్క్రిప్ట్ బుక్‌ను తయారుచేశాను. రవితేజతో ‘ఇడియట్ 2’ సినిమా త్వరలో ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్‌తో ఓ సినిమా వుంటుంది. ఈ రెండు సినిమాల తర్వాతో, లేదా మధ్యలో హిందీ బిజినెస్ మేన్ సినిమా వుంటుంది.

మీడియాలో నేను కూడా...
నా సినిమాల్లో మీడియా మీద కామెంట్స్ ఎక్కువగా వుంటాయంటారు..అయితే అవి ఉద్దేశ్యపూర్వకంగా చేసేవి కావు. నేను కూడా మీడియాలో ఒక భాగంగానే ఫీలవుతాను.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates