skip to main |
skip to sidebar
'అతడు'... మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ల కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం. ఆ సినిమా అటు వినోదపరంగానూ, యాక్షన్ అంశాల విషయంలోనూ అన్ని వయసులవారినీ మెప్పించింది. ఆ కాంబినేషన్‌లోనే మరో చిత్రం రూపుదిద్దుకొంటోంది. మహేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కనకరత్న మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క నాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగింది. ఈ నెల 23 నుంచి రాజస్థాన్‌లో సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. నిర్మాత శింగనమల రమేష్‌బాబు మాట్లాడుతూ ''మహేష్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు కలబోసిన చిత్రమిది. డిసెంబరు నాటికి చిత్ర నిర్మాణం పూర్తవుతుంద''న్నారు. సమర్పణ: ఎస్.సత్యరామమూర్తి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.బుల్లిసుబ్బారావు, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సునీల్ పటేల్.
క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ అన్నారు. ఫేవరేట్ క్రికెటర్ అంటూ ప్రత్యేకించి ఎవ్వరూ లేరని ఆమె చెప్పారు. క్రికెట్ అంటేనే సమిష్టిగా ఆడేదని, అందుకే టీం ఇండియా మొత్తం తన ఫేవరేట్ అని నమ్రతా వెల్లడించారు. ఈ సమ్మర్‌ను కుటుంబంతో గోవాలో ఎంజాయ్ చేస్తామని, జూలైలో గోవాకు ప్రయాణమవుతున్నామని నమ్రత తెలిపారు. జూబ్లీహిల్స్‌లో కొత్తగా నెలకొల్పిన 'కెఫెమిలాంజ్'ను శుక్రవారం నమ్రతా ప్రారంభించారు. తన కుమారుడు గౌతమ్‌తో చాలాసేపు గడిపారు. గౌతమ్ గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పనని మాట దాటవేశారు.అనంతరం కాఫీషాఫ్ అధినేత మాధవ్ మాట్లాడుతూ, సినిమా షూటింగ్‌లకు, వివిధ ఫంక్షన్‌లు చేసుకునేందుకు వీలుగా ఉంటుందనీ కాఫీషాప్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఐదుగురు స్నేహితులు కలిసి ఈ కెఫెమిలాంజ్‌ను స్థాపించామని మాధవ్ తెలిపారు.