మహేష్ తాజా చిత్రం లేటెస్ట్ న్యూస్

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రారంభమైన చిత్రం లేటుగా ప్రారంభమైనా టైట్ షెడ్యూల్తో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ పదిహేను రోజులు పాటు బ్యాంకాక్ లో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించుకుని వచ్చారు. ఇప్పుడు మహేష్, అనూష్క కాంబినేషన్లో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణకోసం రాజస్ధాన్ వెళ్తున్నారు. జూన్ ఇరవై మూడు నుంచి ఆగస్టు ఆరు వరకు దాదాపు నలభై అయిదు రోజుల పాటు అక్కడ షూటింగ్ జరుగుతుంది. మేజర్ పార్ట్ రాజస్ధాన్ ఎడారుల్లో షూట్ చేస్తారని తెలుస్తోంది. వీటి గురించి నిర్మాత శింగనమల రమేష్ మాట్లాడుతూ ఆ సన్నివేశాలే సినిమాలో కీలకం..ప్రేక్షకులను ధియోటర్లలో కట్టిపారేస్తాయని బావిస్తున్నాం అన్నారు. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

థమ్స్‌అప్ ఈట్ టు మీట్


తను తాజాగా నటిస్తున్న చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదనీ, వరుడు మాత్రం కాదని మహేశ్ బాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏడు నెలలు గ్యాప్ తీసుకుని చిత్రాన్ని చేస్తున్నానని, ఇకపై అటువంటి గ్యాప్ ఉండదని అన్నారు. థమ్స్అప్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మహేశ్ మెక్ డొనాల్డ్ అవుట్‌లెట్ నిర్వహించిన "థమ్స్‌అప్ ఈట్ టు మీట్" విజేతలను కలుసుకునేందుకు శుక్రవారం ఐమాక్స్‌‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనతో చిట్ చాట్..

ప్ర. మీరు అభిమానులకు దూరంగా ఉంటున్నారెందుకు?
జ. అదేమీ లేదు. నేను ఇంకా వారికి దగ్గరవడానికి థమ్స్‌అప్ దోహదపడింది. అభిమానుల ఇంటింటికి తిరిగి కలిసే సౌకర్యం కల్పించింది థమ్స్‌అప్.

ప్ర. మరి సినిమా సినిమాకు గ్యాప్ రావడానకి కారణం..?
జ. పెద్ద కారణమేమీ లేదు. యాడ్స్‌లో పాల్గొనడం వల్ల ఈసారి ఆరేడు నెలలు గ్యాప్ తీసుకున్నా. ఇకపై అలా తీసుకోను.

ప్ర. థమ్స్‌అప్ డ్రింక్ తాగమని చెప్పడం సమంజసమేనా...?
జ. ఎందుకు కాదు. 24 గంటలూ తాగమని చెప్పడం లేదు. అప్పుడప్పుడు తాగవచ్చు. నేనూ తాగుతాను. అందులో ఎటువంటి దష్పలితాలు లేవని నా అభిప్రాయం.

ప్ర. మహేశ్ బాబంటే అభిమానులకు క్రేజీ ఎందుకు..?
జ. ఏమో.. నేను అందంగా ఉంటానని అందరూ అంటారు. అందుకనేనేమో...

ప్ర. కాస్త తగ్గినట్లున్నారు. 6 ప్యాక్ చేస్తున్నారా...?
జ. సిక్స్ ప్యాక్‌లు, 8 ప్యాక్‌లు చేయడం లేదు. స్లిమ్‌గా ఉండటానికి తగ్గాను.

ప్ర. మీకు నచ్చిన హీరోయిన్..?
జ. శ్రీదేవి

ప్ర. ఇప్పటి యంగ్ హీరోల్లో ఎవరంటే ఇష్టపడతారు..?
జ. మహేశ్ బాబు అంటే నాకు చాలా చాలా ఇష్టం.

ప్ర. మల్టీస్టారర్ చిత్రాల్లో నటించే అవకాశం ఉందా..?
జ. మల్టీస్టారర్ అంటేనే కథలు దొరకడం కష్టం. అందరికీ నచ్చిన కథలుంటే చేయడానికి నేను వెనుకాడను.

ప్ర. మల్టీస్టారర్ చిత్రాల్లో నటించే అవకాశం ఉందా..?
జ. మల్టీస్టారర్ అంటేనే కథలు దొరకడం కష్టం. అందరికీ నచ్చిన కథలుంటే చేయడానికి నేను వెనుకాడను.

ప్ర. గణేష్ పూజను ఎలా జరుపుకుంటారు?
జ. ఈసారి మా కుటుంబం మొత్తం కలిసికట్టుగా వినాయకుడికి పూజ చేస్తాం.

ప్ర. కెమికల్స్ వాడని గణేష్‌ను పూజిస్తారా..? మట్టి గణేష్‌ను పూజిస్తారా..?
జ. వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మట్టి గణేష్‌కే ప్రాధాన్యత ఇస్తాను.

రాజస్థాన్‌లో "ఖలేజ"


'అతడు'... మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ల కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం. ఆ సినిమా అటు వినోదపరంగానూ, యాక్షన్‌ అంశాల విషయంలోనూ అన్ని వయసులవారినీ మెప్పించింది. ఆ కాంబినేషన్‌లోనే మరో చిత్రం రూపుదిద్దుకొంటోంది. మహేష్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో కనకరత్న మూవీస్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క నాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగింది. ఈ నెల 23 నుంచి రాజస్థాన్‌లో సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. నిర్మాత శింగనమల రమేష్‌బాబు మాట్లాడుతూ ''మహేష్‌ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు కలబోసిన చిత్రమిది. డిసెంబరు నాటికి చిత్ర నిర్మాణం పూర్తవుతుంద''న్నారు. సమర్పణ: ఎస్‌.సత్యరామమూర్తి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బి.బుల్లిసుబ్బారావు, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సునీల్‌ పటేల్‌.

ఇండియన్‌ టీమ్‌ నా ఫేవరేట్‌: నమ్రతా శిరోద్కర్‌ ...

క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ అన్నారు. ఫేవరేట్ క్రికెటర్ అంటూ ప్రత్యేకించి ఎవ్వరూ లేరని ఆమె చెప్పారు.

క్రికెట్ అంటేనే సమిష్టిగా ఆడేదని, అందుకే టీం ఇండియా మొత్తం తన ఫేవరేట్ అని నమ్రతా వెల్లడించారు. ఈ సమ్మర్‌‌ను కుటుంబంతో గోవాలో ఎంజాయ్ చేస్తామని, జూలైలో గోవాకు ప్రయాణమవుతున్నామని నమ్రత తెలిపారు.

జూబ్లీహిల్స్‌లో కొత్తగా నెలకొల్పిన 'కెఫెమిలాంజ్‌'ను శుక్రవారం నమ్రతా ప్రారంభించారు. తన కుమారుడు గౌతమ్‌తో చాలాసేపు గడిపారు. గౌతమ్‌ గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పనని మాట దాటవేశారు.

అనంతరం కాఫీషాఫ్‌ అధినేత మాధవ్‌ మాట్లాడుతూ, సినిమా షూటింగ్‌లకు, వివిధ ఫంక్షన్‌లు చేసుకునేందుకు వీలుగా ఉంటుందనీ కాఫీషా‌ప్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఐదుగురు స్నేహితులు కలిసి ఈ కెఫెమిలాంజ్‌ను స్థాపించామని మాధవ్ తెలిపారు.

అంబాసిడర్

బ్రాండ్ లకు అంబాసిడర్స్ గా సినిమా నటీ నటులు భారీగా రెమున్యురేషన్ వసూలు చేస్తున్నారు. అందరికంటే ఎక్కువగా మహేశ్ బాబు 5 నుంచి 6 కోట్లు వాసూలు చేస్తుండగా, రామ్ చరణ్ తేజ్ 4 కోట్లు, అల్లూ అర్జున్ 2 నుండి రెండున్నర కోట్లు, ఆసిన్ 1.5 నుంచి 2 కోట్లు, జెనీలియా 1 కోటి,త్రిష 80 నుంచి 1 కోటి మరియు ఇలియానా 80 లక్షలు తీసుకుంటున్నట్లు ట్రేడ్ రిపోర్టు.

మహేశ్ బాబు కొత్త చిత్రం 'ఖలేజ' నిర్మాణం శరవేగంగా జెరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చాలా గోప్యంగా చిత్రీకరణ జెరుగుతోంది. సన్నివేశాలు చిరత్రీకరణ జెరుగుతున్న ప్రదేశాలకు మీడియాను కూడా అనుమతించటం లేదు. ఇ‍ంకో ముఖ్య విశయం ఏమిటంటే, మహేశ్ బాబు సిక్స్ పాక్ కోసం శ్రమిస్తున్నాడట.

మహేష్‌బాబుతో త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, స్టార్ రైటర్, డైరక్టర్ త్రివిక్రమ్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన అతడు తర్వాత చేస్తోన్న మరో భారీ చిత్రంగా ఇది తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.

ఎస్. సత్యరామమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ "ప్రొడక్షన్ నెం.2" చిత్రంలో మహేష్ బాబు సరసన అనుష్క కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ అతడు హిట్ తర్వాత త్రివిక్రమ్ చెప్పిన కొత్త సబ్జెక్ట్ తనకు ఎంతో బాగా నచ్చిందని, కథ విని సంతృప్తి చెందడం వల్లే ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేస్తున్నానని పేర్కొన్నారు.

ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను అలరించే అన్ని అంశాలతో, అత్యున్నత ప్రమాణాలతో రూపొందనుందని మహేష్ బాబు తెలిపారు. హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ మహేష్ బాబుతో కలిసి చేస్తున్న తొలి చిత్రమిదని చెప్పారు. సబ్జెక్ట్ చాలా ఆసక్తికరంగా ఉందని, త్రివిక్రమ్ దర్శకత్వంలో పనిచేయడం హ్యాపీగా ఉందన్నారు.

నిర్మాత శింగనమల రమేష్ బాబు మాట్లాడుతూ మహేష్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సెన్సేషనల్ హిట్ తీయాలన్న అభిప్రాయంతో ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. జూన్ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్తో సగం సినిమా పూర్తవుతుందని ఈ సందర్భంగా రమేష్ బాబు తెలిపారు.

హైదరాబాద్‌లో చిత్రీకరించనున్న ఈ షెడ్యూల్ కోసం గండిపేట దగ్గర రెండు కోట్ల రూపాయల వ్యయంతో విలేజ్‌ సెట్ నిర్మిస్తున్నామని తెలిపారు. దీంతోపాటు ఈ చిత్రం కోసం అత్యంత భారీ వ్యయంతో రాజస్థాన్ టెంపుల్ సెట్ వేస్తున్నామని తెలపారు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందే ఈ సినిమా షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలోని నమీబియా, రాజస్థాన్‌, ఇటలీలలోను పాటలు చిత్రీకరించడం ద్వారా దాదాపుగా షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత వివరించారు.

పోకిరితో రికార్డులు బ్రద్దలు కొట్టిన మహేష్ బాబు, అరుంధతితో రికార్డులు సృష్టించిన అనుష్క, జల్సాతో రికార్డులు కొట్టేసిన త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తమ కనకరత్న మూవీస్ బేనర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో ప్రకాష్ రాజ్ బ్రహ్మానంద్, సునీల్, వేణుమాధవ్, ఆలీ, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, షఫీ, సుశీల్ శర్మ, సుధ, శ్రీ రంజని తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం- మణిశర్మ, ఫోటోగ్రఫీ- సునీల్ పటేల్, ఫైట్స్- విజయన్, ఎడిటింగ్- శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్- ఆనంద్‌ సాయి, స్టిల్స్- దాస్, కో-డైరక్టర్స్- జాస్తి హేమాంబర్, రవికిరణ్, ఎగ్టిక్యూటివ్ ప్రొడ్యూసర్- బి. బుల్లి సుబ్బారావు, సమర్పణ- ఎస్. సత్యరామమూర్తి.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates