మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఖలేజా'. అనుష్క నాయిక. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. శింగనమల రమేష్, సి.కల్యాణ్ నిర్మాతలు. మణిశర్మ సంగీతం అందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాటలు విడుదలయ్యాయి. మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌కృష్ణ చేతుల మీదుగా పాటలను ఆవిష్కరింపజేశారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ ''అందరి అంచనాలను అందుకొనే చిత్రమిది. త్రివిక్రమ్ తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకొంటుంది. మణిశర్మ చక్కటి సంగీతం అందించారు. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నాకైతే సదాశివ, పిలిచే పెదవులపైన.. అనే పాటలు బాగా నచ్చాయి. కథానాయకుడిని పరిచయం చేసే పాట ఇంకా వైవిధ్యంగా ఉంటుంది. నేను ట్విట్టర్‌లో కొన్ని పాటల్ని ఉంచాను. అభిమానుల స్పందన బాగుంద''న్నారు. ''మహేష్-త్రివిక్రమ్ కలయిక స్థాయిని చెప్పే చిత్రమిది. మణిశర్మ అందించిన స్వరాలు బాగున్నాయి. పెద్ద విజయాన్ని సాధిస్తుందీ చిత్రం'' అన్నారు అనుష్క. మణిశర్మ మాట్లాడుతూ ''మహేష్‌తో కలిసి చేసిన 'రాజకుమారుడు', 'మురారి', 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి' చిత్రాలు నాకు మంచి పేరును తీసుకొచ్చాయి. వాటిని మించి ఉంటాయి ఇందులోని పాటలు. సదాశివ.. అనే పాటకు చక్కటి స్పందన లభించింద''న్నారు. ''కేవలం పాటలే కాదు, నేపథ్య సంగీతానికి కూడా ప్రాధాన్యం ఉంది. మణిశర్మ సంగీతం ఓ ఆకర్షణ. చిత్రాన్ని వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాత సి.కల్యాణ్. ఈ కార్యక్రమంలో మహేష్ భార్య నమత్ర, నిర్మాత శింగనమల రమేష్, గీత రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సోనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.




Posted in:
ప్రిన్స్ మహేష్‌బాబు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్- ‘ట్విట్టర్’లోకి వెళితే.. ఆయన తనయుడు ‘జూనియర్ ప్రిన్స్’ గురించి ఎక్కువ కబుర్లు కనిపిస్తాయి. జూనియర్ ప్రిన్స్ అంటే అర్థమై వుంటుంది... మహేష్‌బాబు తనయుడు ‘గౌతమ్’ అని. షూటింగ్ లేని సమయంలో కొడుకుతో ఎక్కువ సమయం గడపడం, ఆ చిన్నారితో ఆడుకోవడం, అతని ముద్దు ముద్దు మాటలు వినడం మహేష్‌కు చాలా సరదా. 


‘‘మహేష్ ‘ఖలేజా’ ఏంటో తెలిపే సినిమా ఇది. మహేష్ మాత్రమే చేయగలరు అనిపించే స్థాయిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన పాత్రను తీర్చిదిద్దారు.