ఆమె సింప్లిసిటీ నాకిష్టం. ఆమెలోని స్వచ్ఛత అంటే మరీమరీ ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం పెళ్లిచేసుకుందాం అని నేనెప్పుడూ నమ్రతకు చెప్పలేదు అంటూ ప్రిన్స్ మహేష్ బాబు తన భార్య నమితతో ప్రేమలో పడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..వంశీ సినిమా షూటింగ్ కోసం మేము 40 రోజులపాటు ఫారిన్ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్ ముగిసే చివరి రోజున కానీ, ఈ 40 రోజుల్లో మా మధ్య విడదీయలేనంతగా అనుబంధం ఏర్పడిపోయిందని గుర్తించలేకపోయాం. నమ్రతతో నేను ప్రేమలో పడిన క్షణాలు మరువలేనివి. అయితే దీనిపై నన్నెవరైనా అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అదలా జరిగిపోయిందంతే అన్నారు. అలాగే నాన్న, అమ్మల అంగీకారం తీసుకోవడం కోసం నమ్మతను నేనిష్టపడుతున్నాననీ, ఆమెతో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు నమ్రత గురించి నాన్న వాకబు చేశారు. ఆ తర్వాత 2005 ఫిబ్రవరిలో నేనూ నమ్రత పెళ్లి చేసుకున్నాం. ఆమె నా జీవిత భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం. అయిదేళ్లపాటు డేటింగ్ చేశాక మా ఇద్దరి పెళ్లి జరిగింది. పెళ్లై అయిదేళ్లయింది. మేమిద్దరం గడిపే ప్రతి క్షణం మా బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. నమ్రత నాకు భార్య మాత్రమే కాదు..నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అంటూ ముగించారు. అమృంతాంజనం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఈ విషయాలను సరదాగా చర్చించారు.
0 comments:
Post a Comment