‘జూనియర్ ప్రిన్స్’ హల్‌చల్

ప్రిన్స్ మహేష్‌బాబు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్- ‘ట్విట్టర్’లోకి వెళితే.. ఆయన తనయుడు ‘జూనియర్ ప్రిన్స్’ గురించి ఎక్కువ కబుర్లు కనిపిస్తాయి. జూనియర్ ప్రిన్స్ అంటే అర్థమై వుంటుంది... మహేష్‌బాబు తనయుడు ‘గౌతమ్’ అని. షూటింగ్ లేని సమయంలో కొడుకుతో ఎక్కువ సమయం గడపడం, ఆ చిన్నారితో ఆడుకోవడం, అతని ముద్దు ముద్దు మాటలు వినడం మహేష్‌కు చాలా సరదా.

అంతేకాదు- కొడుకుని అప్పుడప్పుడు సరదాగా షూటింగ్‌కు తీసుకెళ్ళడం.. షాట్ గ్యాప్‌లో గౌతమ్ చెప్పే కబుర్లు వినడం గౌతమ్ చెప్పే ఆ మాటలతో తను ఉప్పొంగిపోవడం మహేష్‌కు మహా ఆనందం. ఇక అసలు విషయానికొస్తే - ఇక్కడి ఫొటోలో చేతిలో గిఫ్ట్‌ప్యాక్‌తో ఆనందంగా, ఉత్సాహంగా అడుగులేస్తున్న ఈ లిటిల్ ప్రిన్స్ మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్‌దెక్కన్ హోటల్‌లో హల్ చల్ చేశాడు.

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కూతురు ‘అహనా’ పుట్టినరోజు వేడుక సందర్భంగా తల్లి నమ్రతా మహేష్‌తో కలిసి వచ్చిన గౌతమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆ వేడుకలో అక్కడి వారిని తన ముద్దు ముద్దు మాటలతో అలరించాడు గౌతమ్.


0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates