రెండేళ్లుగా నిర్మాణంలో ఉండి, ఏడాది కాలంగా ఊరిస్తూ వస్తున్న "మహేష్ ఖలేజా" మూడేళ్ల విరామం తర్వాత విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 24న ఈ చిత్రం ఆడియోను మార్కెట్లో విడుదల చేయనున్నారు. వచ్చే నెల 6న సినిమా విడుదల కానున్నదని సమాచారం. అయితే మహేష్ బాబు పలు యాడ్‌లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాదులో అమృతాంజన్ ప్రకటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పారు. అవి మీకోసం...
ఖలేజా అంటే ఏమిటి..? ఎలా ఉంటుంది..?
టైటిల్‌కు తగినట్లే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నా కెరీర్‌లో ఇప్పటివరకూ నేను చేయని అత్యంత వైవిధ్యభరిత చిత్రంగా ఖలేజాను వర్ణిస్తాను. ఇంతకుముందు నేను చేసిన పాత్రలకు భిన్నంగా చాలా పెద్దదిగా, ఫన్నీగా మాట్లాడుతుండే టాక్సీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాను ఈ చిత్రంలో.
ఇదొక పూర్తి నిడివి వ్యాపారాత్మక చిత్రం. ఇందులో సందేశాలుండవు, స్పీచ్ లుండవు. పైట్స్ కోసం ఫైట్లు అన్నట్లుగా కాకుండా ఈ చిత్రంలోని ఫైట్స్ అన్నీ స్టోరీని సెపరేట్ చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకులు ఆస్వాదించే అన్ని అంశాలు సమపాళ్లలో కలగలిసిన చిత్రం ఖలేజా.
గ్యాప్‌లో మీరు నేర్చుకున్నదేమిటి...?
నేను నటించిన చిత్రం మూడేళ్ల గ్యాప్‌తో విడుదల కావడం నా అభిమానులుకి కొంత నిరాశకు గురి చేస్తుండవచ్చు. కానీ.. ఒక నటుడిగా, వ్యక్తిగా నేను ఇది నాకు ఆనందన్నిచ్చే విషయమైతే.. నాకు అమితంగా బాధ కలిగించిన విషయం నేను ప్రాణప్రదంగా ప్రేమించే మా అమ్మమ్మను పోగొట్టుకోవడం.
అలాగే మా అత్తమామలను( నమ్రత తల్లిదండ్రులు) కోల్పోవడం నన్నెంతగానో బాధించింది. ఈ పరిణామాలన్నీ నా మీద ఎంతగానో ప్రభావం చూపాయి. అయినా సరే నేను నిబ్బరంగా ఉండగలిగానంటే అందుక్కారణం మా నాన్నే. నాకు ఊహ తెలిసేనాటికి ఆయన చాలా పెద్ద హీరో.
ఫ్యాన్స్ చూపే అభిమానం, ఆదరణ అపూర్వం. తను అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఇంట్లో ఎప్పుడూ చాలా సాదాసీదాగా ఉండేవారు. అలాగే ఈరోజున నేను హీరోనయ్యానంటే అది కేవలం మా నాన్న చలవే. నా చదువు పాడవకుండా ప్రతి వేసవిలో నాతో ఒక సినిమా చేయిస్తూ వచ్చారు. నేను హీరోనయ్యానన్నా, బాగా నటిస్తానని పేరుతెచ్చుకుంటున్నా.. వాటన్నిటికీ నానే కారణం.
గౌతమ్‌ను సినిమాల్లోకి తెచ్చే ఆలోచన ఉందా..
భవిష్యత్‌లో ఏమవుతాడో ఎవరూ చెప్పలేం. ప్రస్తుతం ఇంకా చిన్నపిల్లవాడే. నాలుగేళ్ల వయసుకే భవిష్యత్‌లో పెద్ద హీరో అయ్యే లక్షణాలు కనబరుస్తూ ఉంటాడు. గౌతమ్ పుట్టాకే నా జీవితానికో అర్థం, పరమార్థం లభించిందని నేను భావిస్తాను. నాకు లభించిన వెలకట్టలేని ఒక గొప్ప బహుమతి గౌతమ్.. వాడు నా బిడ్డ మాత్రమే కాదు... నా సర్వస్వం. అసలు నా దృష్టిలో పితృత్వం పొందని పురుషుడు పరిపూర్ణుడ కాలేరు.
మీ ముందున్న ప్రధాన లక్ష్యాలు..?
ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం జాతీయ అర్డును సాధించడం. నేషనల్ అవార్డ్ అందుకోవాలన్నది నా కోరిక. నా కల. అవి ఎప్పటికి నెరవేరుతాయో నాకు తెలీదు. అయితే కలగనడంలో తప్పు లేదు కదా..
మీకు ఇష్టం లేనివి ఏమిటి...?
అబద్ధాలాడేవారంటే నాకు అసహ్యం. నేను ఎలాంటి వారినైనా భరిస్తాను కానీ, అబద్ధాలాడేవారిని మాత్రం అస్సలు సహించలేను. అటువంటి వాళ్లంటే నాకు పరమ అసహ్యం. అబద్ధాలాడే పరిశ్రమ, మోసం చేసేవాళ్లను నా దరిదాపులకు కూడా రానీయను. నాతో కలిసి పనిచేసే వాళ్లంతే నిజాయితీ, నిబద్ధత కలిగి నిపుణులై ఉండాలని కోరుకుంటాను.
మీ జీవిత భాగస్వామిలో నచ్చిన అంశమేమిటి..?
వంశీ సినిమా షూటింగ్ కోసం మేము 40 రోజులపాటు ఫారిన్ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్ ముగిసే చివరి రోజున కానీ, ఈ 40 రోజుల్లో మా మధ్య విడదీయలేనంతగా అనుబంధం ఏర్పడిపోయిందని గుర్తించలేకపోయాం. నమ్రతతో నేను ప్రేమలో పడిన క్షణాలు మరువలేనివి. అయితే దీనిపై నన్నెవరైనా అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అదలా జరిగిపోయిందంతే.
ఆమె సింప్లిసిటీ నాకిష్ట. ఆమెలోని స్వచ్ఛత అంటే మరీమరీ ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం పెళ్లిచేసుకుందాం అని నేనెప్పుడూ నమ్రతకు చెప్పలేదు. నాన్న, అమ్మల అంగీకారం తీసుకోవడం కోసం నమ్మతను నేనిష్టపడుతున్నాననీ, ఆమెతో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానని చెప్పాను.
అప్పుడు నమ్రత గురించి నాన్న వాకబు చేశారు. ఆ తర్వాత 2005 ఫిబ్రవరిలో నేనూ నమ్రత పెళ్లి చేసుకున్నాం. ఆమె నా జీవిత భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం. అయిదేళ్లపాటు డేటింగ్ చేశాక మా ఇద్దరి పెళ్లి జరిగింది. పెళ్లై అయిదేళ్లయింది. మేమిద్దరం గడిపే ప్రతి క్షణం మా బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. నమ్రత నాకు భార్య మాత్రమే కాదు.. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా.
పూర్వజన్మల గురించి నమ్ముతారా..
దేవుడిని ఎలా నమ్ముతామో.. పూర్వజన్మలున్నాయనీ నమ్ముతాను. మా నాన్నను నేను ప్రేమించడం మాత్రమే కాదు ఎంతో గొప్పగా ఆరాధిస్తాను. ఆయన వ్యక్తిత్వం, నిరాడంబరత్వం అలవచుకునేందుకు నేనెప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. కృష్ణగారబ్బాయిగా జన్మించడం పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యఫలంగా నేను భావిస్తాను

0 comments:
Post a Comment