‘దూకుడు’ విడుదల కోసం నేను కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర మేకింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. నేను ఇప్పటి వరకూ పనిచేసిన ప్రొడక్షన్స్‌లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ ఇది. ఇక శ్రీను వైట్ల వర్కింగ్ స్టైల్ సూపర్బ్’’... ‘దూకుడు’ సినిమా విషయంలో మహేష్‌బాబు అభిప్రాయం ఇది.
విడుదలకు ముందు తన సినిమాల గురించి ఎక్కువగా ప్రస్తావించని ప్రిన్స్... ‘దూకుడు’ విషయంలో మాత్రం తన మనసు దూకుడుకి కళ్లెం వేయలేకపోయారు. ట్విట్టర్ ద్వారా పై విధంగా తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. ఈ సినిమా విడుదల కోసం మహేష్, ఆయన అభిమానులే కాదు, తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నది నిజం.
ఈ నేపథ్యంలో ఆగస్ట్ చివరి వారంలో ‘దూకుడు’ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్స్‌ని విడుదల చేశారు. ఆ ట్రైలర్స్‌కు అభిమానుల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తోందని కూడా మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో పొందుపరిచారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవల ఇన్‌ఆర్బిట్ మాల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రనిర్మాణం తుది దశకు చేరుకుంది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటలను ఈ నెల చివరి వారంలో విడుదల చేయనున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన సమంత కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Posted in:
Dookudu,
maheshbabu,
prince,
Samantha,
Srinu Vaitla,
telugu,
దూకుడు,
మహేష్,
మహేష్‌బాబు,
శ్రీను వైట్ల,
సమంత