మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలోరూపొందుతున్న తాజా చిత్రం ‘దూకుడు’. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత కథానాయిక. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాం. ఆగస్టు మొదటివారంలో ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. శ్రీనువైట్ల చిత్రాల తరహాలో యాక్షన్‌తో పాటు చక్కటి వినోదం వుంటుంది. థమన్ మహేష్ అభిమానుల్ని అలరించేలా అద్భుతమైన బాణీలను అందించాడు. అయితే కొందరు పైరసీదారులు ఈ చిత్రానికి ఏ మాత్రంలేని సంబంధం లేని పాటలను ‘దూకుడు’ పాటలుగా ప్రచారం చేస్తూ సిడిలను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ప్రేక్షకులు, అభిమానులు ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా వుండాలని కోరుతున్నాం. అధికారికంగా ఈ చిత్ర ఆడియోను ఆగస్టు మొదటివారంలో విడుదల చేస్తాం’ అన్నారు.
0 comments:
Post a Comment