ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘దూకుడు’ చిత్రంలో నటిస్తున్న మహేష్‌బాబు త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘100% లవ్’ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసి ఇంప్రెస్ అయిన మహేష్‌బాబు వెంటనే సుకుమార్‌తో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. కాగా ఈ చిత్రానికి ‘రోబో’ కెమెరామెన్ రత్నవేలు ఛాయాక్షిగహణాన్ని అందిస్తుండటం విశేషం.
గతంలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆర్య, జగడం చిత్రాలకు కూడా రత్నవేలే కెమెరామెన్‌గా పనిచేశాడు. ఆ తర్వాత తెలుగు చిత్రాలకు పనిచేయని రత్నవేలు ఎట్టకేలకు మహేష్-సుకుమార్ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేయటానికి ఒప్పుకున్నాడు. తనకెంతో ఇష్టమైన కెమెరామన్‌తో వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు మహేష్ కూడా ఈ విషయంలో ఆనందంగా వున్నాడట. ప్రస్తుతం మహేష్‌తో ‘దూకుడు’ చిత్రాన్ని నిర్మిస్తున్న 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు రామ్ ఆచంట, గోపీ, అనీల్‌లే ఈ చిత్రానికి కూడా నిర్మాతలు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్న ఈ చిత్రం మహేష్, పూరి జగన్నాథ్‌ల కలయికలో రూపొందనున్న ‘బిజినెస్ మేన్’ చిత్రం తర్వాత ప్రారంభం కానుంది.
0 comments:
Post a Comment