శత్రువు బలాబలాల గురించి అతను ఆలోచించడు. అతని బలమేమిటో ఎదుటివాడికి చూపాలనుకొంటాడు. అందుకు దూకుడే మార్గం అని నమ్ముతాడు. మైండ్‌లో ఒక్కసారి ఫిక్సయితే.. బ్త్లెండ్‌గా దూసుకుపోతాడు. రెప్పపాటు సమయం దొరికినా రెచ్చిపోతాడు. గుండెల నిండా ధైర్యాన్ని కూడగట్టుకొన్న ఆ యువకుడు సాధించాలనుకొన్నదేమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కించారు. సోమవారం నుంచి పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ''మహేష్‌బాబు శైలికి తగ్గట్టుగా మాస్ అంశాలతో కూడిన చిత్రమిది. వినోదానికి ప్రాధాన్యముంది. మహేష్ పాత్రను ఒక కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఆయన ఎంచుకొన్న నేపథ్యం చిత్రానికి ప్రదాన ఆకర్షణగా నిలుస్తుంది. తమన్ అందించిన స్వరాలు అందరికీ నచ్చేలా ఉంటాయి. ఆగస్టు మొదటివారంలో పాటలను, చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామ''ని చెప్పాయి చిత్రవర్గాలు.
0 comments:
Post a Comment